Mahesh Babu Hobbies : ఖాళీగా ఉంటే మ‌హేష్ బాబు ఏం చేస్తారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

November 17, 2023 12:59 PM

Mahesh Babu Hobbies : కృష్ణ వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మ‌న‌స్త‌త్వం మ‌హేష్ బాబుది. సూపర్ స్టార్ మహేష్ బాబుది గోల్డెన్ హార్ట్ అంటూ కొనియాడుతారు అభిమానులు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఒకడైన మహేష్.. ఎన్నో ఏళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఛారిటీ కోసం ఉపయోగిస్తుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక ఆసుపత్రి భాగస్వామ్యంతో అతను ఎంతోమంది అభాగ్యులైన చిన్నారుల ప్రాణాలు కాపాడాడు.

మహేష్ బాబు ఫౌండేషన్ పేరు మీద 2500 గుండె ఆపరేషన్లు జరిగాయంటే ఆయ‌న మంచి మ‌నస్సు ఎలాంటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. తన కొడుకు పుట్టినపుడు చిన్న ఇబ్బంది తలెత్తితే.. అది చూసి పేద చిన్నారులకు సమస్య తలెత్తితే ఎలా అనే ఆలోచనతో ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు మ‌హేష్ బాబు. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద విద్యా నిధి పథకాన్ని ప్రారంభించాడు. ప్రాథమికంగా 40 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంచుకుని.. వారికి స్కూల్ స్థాయి నుంచి పీజీ వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.తండ్రికి మహేష్ ఇస్తున్న గొప్ప నివాళి ఇదంటూ ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి.

Mahesh Babu Hobbies what he will do in his free time
Mahesh Babu Hobbies

మహేష్ బాబు సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా పైన చాలా రూమర్లు వస్తున్నాయి.ఎందుకంటే ఇప్పటికే సినిమాని స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు.సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అనే సందేహం కూడా ఉంది. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న కూడా మ‌హేష్ ఫ్యామిలీకి ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తాడు. ఇంక ఖాళీ ఉంటే పుస్త‌కాలు ఎక్కువ‌గా చ‌దువుతాడ‌ట‌. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో ర‌కాల బుక్స్ మ‌హేష్ చ‌దువుతాడ‌నే టాక్ ఇప్పుడు ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now