Maa Oori Polimera 2 on OTT : టాలీవుడ్‌లో సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే సినిమాలు భారీ సంఖ్యలో వస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఓ రేంజ్‌లో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ అవుతుండగా, అందులో ‘మా ఊరి పొలిమేర 2’ సినిమా ఒకటి. నేరుగా ఓటీటీలో విడుదలై బిగ్ హిట్ అయిన ‘పొలిమేర’కు ఇది సీక్వెల్‌గా రూపొందింది. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీని భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. ఫలితంగా ఈ మూవీ కోట్ల లాభాలను సొంతం చేసుకుంది. మా ఊరి పొలిమేర-2 సినిమా డిసెంబర్ 8వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
ఆహా గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు అంతకంటే 24 గంటలు ముందుగానే అందుబాటులోకి వచ్చింది. ఆహా ఓటీటీలో ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. స్ట్రీమింగ్‍కు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఆహాలో 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాల మార్కును మా ఊరి పొలిమేర-2 దాటేసింది. ఓటీటీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన పొలిమేర-2 అంటూ ఆహా ట్వీట్ చేయగా, ఇది చూసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. 100 మిలియన్ నిమిషాలను ఈ మూవీ దాటినట్టు పోస్టర్ రిలీజ్ చేయడం గమనర్హం. మా ఊరి పొలిమేర సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు.
నవంబర్ 3వ తేదీన థియేటర్లలో రిలీజై మంచి హిట్ కొట్టింది. క్షుద్రపూజలు, క్రైమ్ ఎలిమెంట్లతో థ్రిల్లర్‌గా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇప్పుడు ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సక్సెస్ సాధించింది. థియేటర్‌లో ఈ సినిమాని మిస్ అయిన వారు ఓటీటీలో మాత్రం మిస్ చేసుకోకుండా తప్పక చూడండి.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…