Karimnagars Most Wanted OTT : ఓటీటీలో కంటెంట్ ప్రధానంగా హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మంచి చిత్రాలని ఇటీవల డైరెక్ట్‌గా ఓటీటీలోకి విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. డిసెంబర్ 15 లేదా 22 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుందని టాక్ నడుస్తుంది.. మరి ఎందులో ఇది స్ట్రీమింగ్ కానుంది అనేదే కదా మీ డౌట్. తెలుగు ఓటీటీ ఆహాలో ఇది సందడి చేయనుంది.
ఈ చిత్రానికి బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించగా, రమేష్ ఎలిగేటి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేయగా, ఓ నలుగురు యువకులు ఖైదీ డ్రెస్‌లలో కనిపిస్తోన్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.పోస్టర్ చూస్తుంటేనే సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం కథ మొత్తం కరీంనగర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, తెలంగాణ యాస, భాషలతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనే టాక్ నడుస్తుంది.
చిత్రంలో నలుగురు స్నేహితులు ఎలా క్రిమినల్స్‌గా మారారు?వారు చేసిన నేరం ఏమిటన్నది? రివేంజ్ డ్రామాతో ఈ సినిమాని ఎలా చూపించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. కరీనంగర్స్ మోస్ట్ వాంటెడ్ మూవీలో అమన్ సూరేపల్లితో పాటు సాయి, రాహుల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరీనంగర్స్ మోస్ట్ వాంటెడ్ సినిమాకు సాహిత్య సాగర్ మ్యూజిక్ అందిస్తోండగా…అనంత్ శ్రీకర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.అమన్, సాయి హీరోలుగా నటించారు. మూవీ మంచి విజయం సాధిస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…