Kannur Squad OTT Release Date : వంద కోట్లు రాబ‌ట్టిన మ‌మ్ముట్టి చిత్రం ఓటీటీలోకి.. ఎప్ప‌టి నుండి స్ట్రీమింగ్ కానుందంటే..!

November 11, 2023 4:17 PM

Kannur Squad OTT Release Date : మ‌ల‌యాళ చిత్రాలు ఇటీవ‌ల మంచి విజ‌యాలు అందుకుంటున్నాయి. ఆ చిత్రాల‌ని మ‌ల‌యాళ ప్రేక్ష‌కులే కాక ఇత‌ర భాష‌ల‌కి సంబంధించిన ప్రేక్షకులు సైతం ఆద‌రిస్తున్నారు. ఇక మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి ఇటీవ‌లి కాలంలో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్నాడు. ఆయ‌న‌న హీరోగా వచ్చిన తాజా చిత్రం కన్నూర్ స్క్వాడ్. మమ్ముట్టి కంపెనీ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు రాబి వర్గీస్‌ రాజ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మమ్ముట్టి, రోనీ డేవిడ్ రాజ్, అజీస్, శబరీష్ వర్మ, కిశోర్ ప్రధాన పాత్ర‌ల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుద‌లై పెద్ద విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ ద‌గ్గర అవలీల‌గా వంద కోట్ల వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కుల కోసం గుడ్ న్యూస్ చెప్పారు మేక‌ర్స్. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ హిట్ మూవీ మొదట నవంబర్ 10 నుంచి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా గురువారం (నవంబర్ 9) హాట్‌స్టార్ అఫీషియల్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ చిత్రం రియ‌లిస్టిక్ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాబీ వ‌ర్గీస్ రాజ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. క‌న్నూర్ స్వ్కాడ్ పేరుతో నిజంగానే కేర‌ళ‌లో ఓ స్పెష‌ల్ పోలీస్ టీమ్‌ ఉండేది, ఆ టీమ్ సాల్వ్ చేసిన క్రైమ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్టు డైరెక్ట‌ర్ తెలియ‌జేశాడు.

Kannur Squad OTT Release Date
Kannur Squad OTT Release Date

క‌న్నూర్ స్క్వాడ్ ఓ సినిమాలా కాకుండా పోలీసులు ఇన్వేస్టిగేష‌న్‌ను నిజంగానే చేస్తున్న‌ట్టుగా క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రింప‌జేశాడు. క్రైమ్ అంశాల‌తో పాటు వృత్తికి, వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌ల‌కు మ‌ధ్య పోలీసుల‌కు ఎదుర్కొనే సంఘ‌ర్ష‌ణ‌ను ఈ సినిమాలో చూపించారు.ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇక మ‌మ్ముట్టి ఇప్పుడు యాత్ర 2 అనే తెలుగు చిత్రం కూడా చేస్తున్నారు. యాత్ర మంచి విజ‌యం సాధించ‌డంతో యాత్ర‌2లో కూడా న‌టించేందుకు ఆస‌క్తి చూపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now