నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన సినిమాలు నేడు పాన్ ఇండియా రెంజ్ లో విడుదలవుతున్నాయంటే.. అది ఆయన ఫ్యాన్స్ వల్లే.. అందుకే ఆయన తన ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయడానికి వెనకాడాడు. తనని ప్రేమించే అభిమానులకు అండగా నిలుస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన అభిమానికి తాజాగా వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. ఆ సమయంలో అభిమాని ముఖంలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్ చేసిన పనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.
ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్నఎన్టీఆర్ వీరాభిమాని పేరు కౌశిక్. కౌశిక్ వయసు 19 ఏళ్లే. కానీ విధి అతడి జీవితాన్ని తారుమారు చేసింది. కొంత కాలంగా అతడు బోన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ఇటీవల ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి, తమ కుమారుడి చివరి కోరిక ఏంటో చెప్పారు. చనిపోయేలాగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలన్నదే తమ కుమారుడి ఆఖరి కోరిక అని, దేవర సినిమా చూసేంతవరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా, తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు.
తాజాగా కౌశిక్ కు వీడియో కాల్ చేసి అతడిని సంతోషసాగరంలో ముంచెత్తారు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి… నవ్వుతుంటే చక్కగా ఉన్నావు అని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. మీతో మాట్లాడతానని అసలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా… భలేవాడివే, అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ ను జయించి రావాలని పేర్కొన్నారు. సినిమా సంగతి తర్వాత… ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి… మీ అమ్మానాన్నలను చూసుకోవాలి అని ఆకాంక్షించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…