Jr NTR And Ram Charan : పాపం ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌ని ఇలా వాడేస్తున్నారేంటి.. షాక్‌లో ఫ్యాన్స్

November 11, 2023 4:13 PM

Jr NTR And Ram Charan : టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ త‌ప్ప‌క ఉంటారు. ఈ ఇద్ద‌రు హీరోలు క్రియేట్ చేసిన సెన్సేష‌న్ అంతా ఇంతా కాదు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్ కావ‌డంతో ఆ కాంబో మంచిగా కుదర‌డం, చిత్రం కూడా సూప‌ర్ హిట్ కావ‌డం జ‌రిగింది. అయితే ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ స్థాయి అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఈ క్ర‌మంలో వీరి క్రేజ్‌ని సినిమా మేక‌ర్స్ తెగ వాడేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం అఖిల్ న‌టించిన ఏజెంట్ చిత్రంతో రామ్ చ‌ర‌ణ్ ధృవ‌తో ఏదో క‌నెక్ష‌న్ ఉన్న‌ట్టు ప్ర‌చారం చేసి రామ్ చ‌ర‌ణ్ క్రేజ్‌ని వాడుకున్నారు.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ క్రేజ్‌ని వాడుకున్న‌ట్టు తెలుస్తుంది.

బాలీవుడ్ చిత్రం టైగర్ 3 యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందుతుంది. ఈ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ పేరుతో ఈ చిత్రాలు తెరకెక్కిస్తోంది. భవిష్యత్తులో టైగర్, పఠాన్, వార్ చిత్రాలని కలుపుతూ భారీ చిత్రాలు చేసే ఆలోచనలో ఉంది. అయితే షారూఖ్ న‌టించిన పఠౄన్‌లో స‌ల్మాన్ గెస్ట్ రోల్ పోషించాడు. ఇక ఇప్పుడు టైగర్ 3లో షారుఖ్ తో పాటు హృతిక్ కూడా కాసేపు సందడి చేస్తాడని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ కూడా న‌టించ‌బోతున్న నేప‌థ్యంలో టైగ‌ర్ 3 చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా న‌టించ‌నున్నాడ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకొస్తున్నాయి. రామ్ చరణ్ లాగా ఎన్టీఆర్ ని కూడా టైగర్ 3కి తెలుగులో పబ్లిసిటీ కోసం వాడేస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు అంద‌రిలో మెదులుతున్నాయి.

Jr NTR And Ram Charan they are being used for promotions
Jr NTR And Ram Charan

ఈ విష‌యంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. అన‌వ‌స‌రంగా త‌మ హీరో ఇమేజ్ ఎందుకు వాడుకుంటున్నార‌ని ఫైర్ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన లియో చిత్రంలో రాంచరణ్ కూడా భాగం కాబోతున్నారని.. లియో చిత్రంలో రాంచరణ్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారాలు జ‌రిగాయి కాని అలాంటిదేమి జ‌ర‌గేలేదు. అయితే ముఖ్యంగా తెలుగులో త‌మ సినిమా ప్ర‌మోష‌న్ కోసం రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పేర్ల‌ని తెగ వాడేస్తున్నార‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now