వినోదం

JioTV Premium Plans : జియో టీవీ ప్రీమియం బంప‌ర్ ఆఫ‌ర్.. ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు..

JioTV Premium Plans : ప్రముఖ టెలికం సంచలనం రిలయన్స్ జియో.. తన అనుబంధ జియో టీవీ సబ్ స్క్రైబర్ల కోసం అద్భుతమైన ‘టీవీ ప్రీమియం’ ప్లాన్లు తీసుకు వ‌చ్చింది.ఇలాంటి ప్లాన్ తీసుకు రావ‌డం ఇదే మొద‌టి సారి అని చెప్పొచ్చు. ఈ ప్లాన్ ప్రకారం ఒకేసారి 14 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వాడుకోవచ్చు.మూడు ‘జియో టీవీ ప్రీమియం ప్లాన్ ల విష‌యానికి వ‌స్తే.. ధర రూ. 398, రూ. 1,198, రూ. 4,498 ప్లాన్లుగా ఉన్నాయిఇ. ఈ ప్లాన్లు వేర్వేరు వాలిడిటీలతో వస్తాయి. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏదైనా ప్లాన్‌ని ఎంచుకోవచ్చు. 28 రోజులు, 84 రోజులు, ఏడాది గడువునకు వేర్వేరు ప్లాన్లు ప్రకటించింది. నెలవారీ, మూడు నెలలు, వార్షిక ప్లాన్స్ రూ.398 నుంచి ప్రారంభం కానున్నాయి.

జియో టీవీ ప్రీమియం ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే… జియో సినిమా ప్రీమియం, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, డాక్యుబే, సన్‌నెక్స్‌ట్, హొయ్‌చొయ్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, ఎపిక్‌వన్ వంటి 14 ఓటీటీ సర్వీసులకు యాక్సెస్ పొందుతారు. రూ. 398 ప్లాన్‌లో 12 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. రూ. 1,198, రూ. 4,498 ప్లాన్‌లతో 14 ఓటీటీ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. రూ.398 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, రూ.1,198 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగానూ, 365 రోజుల వ్యాలిడిటీతో రూ.4,498గా ఉంది. ఇక్క‌డ విశేషం ఏంటంటే ప్రతి ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 2 జీబీ డేటాను కూడా పొందుతారు. 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్ అందిస్తాయి.

JioTV Premium Plans

జియోటీవీ ప్రీమియం ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడం ద్వారా అనేక విభిన్న ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే అవసరం ఇక ఉండదు. జియో టీవీ యాప్‌కి సైన్ ఇన్ చేయడం ద్వారా, ఓటీటీ యాప్స్ కోసం ప్రత్యేక లాగిన్‌లు, పాస్‌వర్డ్‌లను సృష్టించడం, గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఒకే చోట నుంచి విభిన్న యాప్‌ల కంటెంట్‌ను వీక్షించే ఛాన్స్ ఉంటుంది. రూ. 4,498 ప్లాన్ తీసుకున్న తర్వాత మీరు సింగిల్ క్లిక్ కస్టమర్ కేర్ కాల్ బ్యాక్ సౌకర్యం కూడా పొందుతారు. ఈ ప్లాన్ చెల్లింపును ఈఎంఐ ద్వారా కూడా చేయవచ్చు. జియో యూజర్లకు ఇప్పటికే జియో టీవీ, జియో సినిమాలాంటి ఆ సంస్థకు చెందిన యాప్స్ ఫ్రీయాక్సెస్ ఉండగా.. తాజా ప్లాన్స్ ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు కూడా అందిస్తుండ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM