Japan Movie OTT Release Date : తమిళ స్టార్ హీరో కార్తీ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన నవంబర్ 10న జపాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజు మురుగున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్యాన్యుయేల్ నటించారు. సునీల్, విజయ్ మిల్టన్, కేఎస్ రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జపాన్’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కొంత వెనకడుగు వేసింది. విమర్శకులనుంచే కాదు.. ప్రేక్షకుల నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.
జపాన్ సినిమాకి మొదటి రోజు మంచి కలెక్షన్స్ వచ్చిన.. మౌత్ పబ్లిసిటీ ద్వారా కలెక్షన్లకి గండిపడింది. రోజు రోజుకు సినిమా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. జపాన్ విడుదలైన రోజే.. జిగిర్తాండ డబుల్ ఎక్స్ సినిమా కూడా రిలీజ్ అవ్వటం జపాన్ కలెక్షన్లకు గండి కొట్టింది. జపాన్ మొదటి రోజు వసూళ్లు కేవలం 10 కోట్లకే పరిమితం అయ్యాయి. విడుదలై నెలరోజులు గడవకముందే జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 1 లేదా 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
జపాన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారట. . ఈసినిమాలో హీరో కార్తీకి బంగారం అంటే ఎంతో ఇష్టం కాగా, ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాగా జీవిస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి అతడు రూ.200 కోట్ల విలువైన బంగారం దొంగతనం చేశాడని అతనిపై నింద పడుతుంది. చేయని నేరం నుంచి కార్తీ ఎలా తప్పించుకున్నాడనేది జపాన్ చిత్రం. ఈ మూవీ ఓటీటీలో వస్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…