Japan Movie OTT Release Date : జ‌పాన్ ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ అప్‌డేట్.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

November 24, 2023 5:28 PM

Japan Movie OTT Release Date : తమిళ స్టార్‌ హీరో కార్తీ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న న‌వంబ‌ర్ 10న జ‌పాన్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. రాజు మురుగున్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్యాన్యుయేల్‌ నటించారు. సునీల్‌, విజయ్‌ మిల్టన్‌, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘జపాన్‌’ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద కొంత వెన‌క‌డుగు వేసింది. విమర్శకులనుంచే కాదు.. ప్రేక్షకుల నుంచి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.

జ‌పాన్ సినిమాకి మొదటి రోజు మంచి క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌.. మౌత్‌ పబ్లిసిటీ ద్వారా కలెక్షన్లకి గండిపడింది. రోజు రోజుకు సినిమా కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి. జపాన్‌ విడుదలైన రోజే.. జిగిర్తాండ డబుల్‌ ఎక్స్‌ సినిమా కూడా రిలీజ్‌ అవ్వటం జపాన్‌ కలెక్షన్లకు గండి కొట్టింది. జపాన్‌ మొదటి రోజు వసూళ్లు కేవలం 10 కోట్లకే పరిమితం అయ్యాయి. విడుదలై నెలరోజులు గడవకముందే జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 1 లేదా 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అనౌన్స్ చేయనున్నట్లు స‌మాచారం.

Japan Movie OTT Release Date streaming details
Japan Movie OTT Release Date

జపాన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకున్నట్లు టాక్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారట. . ఈసినిమాలో హీరో కార్తీకి బంగారం అంటే ఎంతో ఇష్టం కాగా, ఎప్పుడూ దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాగా జీవిస్తుంటాడు. అయితే ఉన్నట్లుండి అతడు రూ.200 కోట్ల విలువైన బంగారం దొంగతనం చేశాడని అత‌నిపై నింద ప‌డుతుంది. చేయని నేరం నుంచి కార్తీ ఎలా తప్పించుకున్నాడనేది జపాన్ చిత్రం. ఈ మూవీ ఓటీటీలో వ‌స్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now