Janhvi Kapoor : కావాల‌నే ఆ స‌మయంలో అమ్మ‌ని దూరం పెట్టానంటూ జాన్వీ క‌పూర్ కామెంట్స్

December 17, 2023 5:32 PM

Janhvi Kapoor : ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల ముద్దుగుమ్మ‌ల‌లో జాన్వీ కపూర్ కూడా ఒక‌రు. ధడక్ సినిమాతో వెండితెరకు పరిచయమైన‌ ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత వరుస అవకాశాలు వ‌చ్చిన ఈ అమ్మ‌డికి స‌క్సెస్ రాలేదు. అయిన‌ప్ప‌టికీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. విభిన్న కంటెంట్ చిత్రాలు.. అంతకుమించి మంచి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ క‌పూర్. ఈ అమ్మ‌డు సౌత్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ రొమాంటిక్‌, కామిక్‌, హార్రర్‌, థ్రిల్లర్‌.. ఇలా అన్ని జోనర్లలో సినిమాలు చేస్తూ వెళ్తూ తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. బాలీవుడ్‌లో ఈ భామకు విజయాలు తక్కువే అయినా త‌న పాత్ర‌ల ద్వారా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తన తల్లి శ్రీదేవిని గుర్తు తెచ్చుకుంది. తాను కెరీర్ మొద‌ట్లో శ్రీదేవి కూతురునన్న కారణంగా అభద్రతా భావనకు గురైనట్లు చెప్పుకొచ్చింది. అందువల్లనే తొలి సినిమా సమయంలో తన తల్లి సలహాలు, సూచనలు తీసుకోలేదని తెలిపింది. సినిమా సెట్స్‌కు కూడా తల్లి శ్రీదేవిని రావొద్దని ఈ అమ్మ‌డు చెప్పింద‌ట‌.

Janhvi Kapoor sensational comments on sridevi
Janhvi Kapoor

నేను శ్రీదేవి కూతురిని కాబ‌ట్టే సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని చాలా మంది అనేవారు. ఆ మాట‌లు న‌న్ను ఇబ్బందికి గురి చేశాయి. అందుకే అమ్మ సలహాలు, సూచనలతోపాటు తన సపోర్ట్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీలో సొంతంగా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా.ఆ క్ర‌మంలోనే నా తొలి సినిమా సెట్‌కి కూడా రావొద్ద‌ని అన్నాను. ఎలాంటి సాయం చేయోద్ద‌ని చెప్పాను. అమ్మ కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నందుకు అభద్రతా భావనకు గురయి అమ్మను చాలా దూరం పెట్టా. అప్పుడు అమ్మ విషయంలో నేను ఎంత తెలివితక్కువగా ఆలోచించానో ఇప్పుడు అర్థమవుతోంది అంటూ జాన్వీ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now