Jabardasth Rakesh : జబర్ధస్త్ కామెడీ షోతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. చిన్న పిల్లలతో ఎక్కువగా స్కిట్లు చేసి తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు రాకేష్. రీసెంట్‌గా ఆయన కేసీఆర్ అనే మూవీని తీశాడు. ఎన్నికల కారణంగా సెన్సార్ నిలిపివేశారు. ఈ ఎన్నికలు ముగిశాక ఆ చిత్రం థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, చిత్రాన్ని రెండు మూడు రోజుల్లో విడుదల చేయాలని అనుకున్నారు. ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ చేయాలని రాకేష్ చాలా కష్టాలు పడ్డాడు. అయితే, రాకింగ్ రాకేష్‌కు ఈసీ షాక్ ఇచ్చింది. సినిమా విడుదల వాయిదా పడింది.
ఇక ఈ ఖాళీ సమయాన్ని తన సినిమాని ప్రమోషన్స్ కోసం వాడుకుంటాను అని రాకేష్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తాజాగా తన పెళ్లికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. మాది వరంగల్ కాగా, మా ఊరి పక్కన సుజాత వాళ్లది. అలా ఇద్దరి మధ్య పరిచయం సాగింది. ఇంటర్వ్యూ కోసం ఓ సారి ఆమె పని చేసిన ఛానెల్‌కు వెళ్లాను.. అక్కడ మరింత పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడు ఇద్దరం కష్టసుఖాలు గురించి మట్లాడుకునే వాళ్లం. తను తన జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అయితే తన బాధలని చూసి నేను మణికొండలో నా ఇంటి పక్కన ఆమెకి ఓ ఇల్లు చూశాను. అమ్మతో మంచిగా ఉండేది. ఆమెని పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు.
మొదటి నుండి నాకు పెళ్లిపైన అంత ఆసక్తి ఉండేది కాదు. మా గురువు రాళ్లపళ్లి చనిపోయిన తరువాత నేను ఎక్కువగా ఆయన సమాధి దగ్గర ఉండేవాడిని. స్మశానంలోనే ఎక్కువగా ఉండేవాడిని. అప్పుడు నా కోసం ఆమె స్మశానానికి కూడా వచ్చేది. మా పెళ్లికి అంతా ఆమె కష్టపడి చేసింది. వాళ్ల ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి కార్యక్రమాలని దగ్గరుండి చూసుకొని చాలా కష్టపడింది. నేను వేరే వాళ్ల పెళ్లికి వెళ్లినట్టు సింపుల్‌గా వెళ్లాను. తను చాలా మంచిది అని రాకేష్ అన్నాడు. ఇక ఓ సారి నన్ను జబర్దస్త్ నుంచి బయటికి వెళ్లిపోమని చెప్పారు.ఎవరో చెప్పిన మాటలు విని నన్ను బయటికి గెంటేసారు. అప్పుడు నిజనిజాలు తెలుసుకొని నన్ను అనండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.ఆ తర్వాత వాళ్లే నిజం తెలుసుకొని మళ్లీ నన్ను జబర్దస్త్ కి పిలిపించారు అని తెలిపారు రాకేష్.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…