Sridevi : శ్రీదేవి దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి బాలీవుడ్‌లో తన సత్తా చాటి లేడీ సూపర్ స్టార్ హోదాని సొంతం చేసుకుంది. అందం, అభినయం కలగలిపిన శ్రీదేవి తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో 270 సినిమాలు చేసింది. శ్రీదేవి ఉంటే చాలు హిట్ అవుతుందనే మ్యాజిక్ మంత్రం అప్పట్లో బాగా ఉండేది. దాంతో అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు ప్రేక్షకులు కూడా ఆ సినిమాల మీద అంచనాలు పెట్టుకునేవారు. అయితే శ్రీదేవి నటించిన కొన్ని సినిమాలు విడుదల అవ్వలేదనే విషయం మీకు తెలుసా. కొన్ని సినిమాలకు డేట్స్ ఇచ్చి, మరికొన్ని షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ప్రేక్షకుల వరకు రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవో తెలుసా.
1988లో డైరెక్టర్ రమేష్ సిప్పీ వినోద్ ఖన్నా, శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లతో జమీన్ సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. సినిమాలో కొంత భాగం కూడా చిత్రీకరించారు. తరువాత ఆగిపోయింది. ఇది పూర్తయితే శ్రీదేవి, మాధురీ దీక్షిత్‌లు కలసిన నటించిన తొలి సినిమా అయ్యేది. రమేష్ సిప్పి 1991లో శ్రీదేవి, వినోద్ ఖన్నా, రుషి కపూర్‌లతో గర్జన పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ట్రైలర్ రిలీజ్ అయినా సినిమా షూటింగ్ జరగలేదు. స్టార్‌కాస్ట్ విషయంలో వివాదం చోటుచేసుకోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని సమాచారం.
డైరెక్టర్ అనిల్ శర్మ 1990లో అనిల్ కపూర్, శ్రీదేవితో మహారాజ్ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. కారణం తెలియదు కానీ ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది. 1996లో అనిల్‌కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను, శ్రీదేవి కలిసి గోవిందా అనే సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఫొటోషూట్ అయినప్పటికీ సినిమా చిత్రీకరణ జరగలేదు. అప్పట్లో ఆగిపోయిన తన సినిమాల గురించి శ్రీదేవి బాధపడేది కాదట. ఎందుకంటే వాటి గురించి ఆలోచించే తీరిక ఆమెకి ఉండేది కాదని బాలీవుడ్ మీడియా ఓ కథనంలో తెలిపింది. నిజమే కదా బాలనటిగా ఉన్నప్పుడే రోజుకు మూడు షిప్టులు పనిచేసేదని చెప్తుంటారు. ఇక సూపర్ స్టార్ అయ్యాక తన పరిస్థితిని అర్దం చేసుకోవచ్చు.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…