Hyper Aadi : జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన కమెడీయన్ హైపర్ ఆది. ఓ వైపు బుల్లితెరపై హయ్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఉన్న హైపర్ ఆది.. సినిమాల్లోనూ బిజీ ఆర్టిస్ట్‌గా మారాడు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి వచ్చి.. సినిమా అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన ఆది ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఆయన కాల్షీట్స్ కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. అయితే తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికికారణం జబర్దస్త్.. ఈటీవీ.. మల్లెమాల వల్లే అని అంటున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆదయ్య.. హైపర్ ఆదిగా ఎలా మారాడు.. తన రెమ్యూనరేషన్ వివరాలతో పాటు.. తన ఎడ్యుకేషనల్ క్వాలిషికేషన్ గురించి కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.
కాలేజ్ రోజుల్లో నేను మిమిక్రీ చేసేవాడిని .. అలాగే ఇమిటేట్ చేసేవాడిని. పంచ్ లు వేయడం కూడా అప్పటి నుంచే ఉంది. ఇక నటన విషయానికి వస్తే, మా నాన్న నాటకాలు వేసేవాడు. ఆయనను చూస్తూ పెరగడం వలన, ఆయన నుంచి నటన అనేది వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. మేము ముగ్గురం అన్నదమ్ములం .. మా చదువుల కోసం మా నాన్న 20 లక్షల వరకూ అప్పుచేశాడు. నేను జాబ్ చేయడం వలన వచ్చిన డబ్బు, వడ్డీలు కట్టడానికి సరిపోయేది. ఇలా ఎంతకాలం అనిపించింది .. మాట పడటం ఇష్టం లేక, మాకున్న 3 ఎకరాలు అమ్మేశాము. కాకపోతే ఈ విషయంలో మా అమ్మానాన్నలను ఒప్పించడం కొంచెం కష్టమైంది అంతే” అని చెప్పాడు.
ఇక ఢీ షోలో తాజాగా సందడి చేసిన ఆది.. సుధీర్‌పై అదిరిపోయే పంచ్‌లు వేశాడు. `సుధీర్ ఈజ్ బ్యాక్` అంటూ బ్యాండ్ కూడా వేసుకున్నారు. ఏంచేస్తున్నావని హైపర్ ఆది.. సుధీర్‌ని అడిగారు. బాలీవుడ్ నుంచి రెండు స్టోరీస్ వచ్చాయి రా వింటున్నా అన్నాడు సుధీర్. దీనికి `నేను కూడా వింటున్నా అన్నా..అని ఏం కథలని అడగ్గా `నువ్వు చెప్పే సొళ్లు కథలు` అంటూ దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు ఆది. ఇక రాత్రిళ్లు ఏం చేస్తాడో మొత్తం చెప్పేశాడు. రాత్రి 10.30 వరకే `కాలింగ్ సహస్త్ర` అని.. పదిన్నర దాటిందా.. కాలింగ్ గీత, కాలింగ్ సరళ.. ఫస్ట్ కాలింగ్.. ఆ తర్వాత కూలింగ్. ఆ తర్వాత లింగడి లింగడి లింగడి.. అంటూ సుధీర్ గురించి అసలు విషయం చెప్పాడు ఆది. ఆ తర్వాత ఆది, సుధీర్, ప్రదీప్ మధ్య జరిగిన సందడి ప్రేక్షకులని తెగ ఎంటర్‌టైన్ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…