Guppedantha Manasu October 25th Episode : శైలేంద్ర పేరు చెప్పేసిన వసుధార.. వసుధార కి రిషి వార్నింగ్..!

October 25, 2023 8:46 AM

Guppedantha Manasu October 25th Episode : జగతి చనిపోవడానికి శైలేంద్ర, దేవయాని కారణం అని నిజాన్ని, వసుధార రిషితో చెప్తుంది. ఆమె మాటలు రిషి నమ్మడు. వాళ్ల గురించి, తప్పుగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ లో ఏం జరిగిందో చూస్తే… మహేంద్ర కి ప్రాణ స్నేహితురాలు అనుపమ కనపడుతుంది. జగతి గురించి అడుగుతుంది. జగతి చనిపోయిందన్న విషయాన్ని చెప్పడు. మళ్లీ కలిసినప్పుడు, సమాధానం చెప్తానని చెప్పి తప్పించుకుంటాడు. జగతి అంటే, తనకి ప్రాణం అని, వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేస్తానని, పెద్దమ్మతో అనుపమ అంటుంది. నీ మనసులో మాట, మహేంద్రతో ఎందుకు చెప్పలేదని, అనుపమని పెద్దమ్మ అడుగుతుంది.

ఎప్పటికీ చెప్పలేను, చెప్పను అని అంటుంది. మనసులోనే దాచుకుంటానని చెప్తుంది. అనుపమ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మళ్లీ మహేంద్రని కలిసి జగతి గురించి అడగమని పెద్దమ్మ అనుపమతో చెప్తుంది. జగతి గురించి అడిగితే, మహేంద్ర చెప్పకపోవడానికి కారణం ఏంటో అనుపమ కి అర్థం కాదు. అపోహల కారణంగా, విడిపోయిన వాళ్ళు, ఇంకా కలవలేదని అనుకుంటుంది. తానే కలపాలని అనుకుంటుంది. జగతి గురించి వెంటనే తెలుసుకోవాలని, మహేంద్ర ఉంటున్న హోటల్ కి ఫోన్ చేస్తుంది.

కానీ, అతనితో మాట్లాడలేక ఫోన్ కట్ చేసేస్తుంది. అనుపమనే తనకి ఫోన్ చేసిందని మహేంద్ర కి అర్థమవుతుంది. జగతి చనిపోయిన విషయం, ఆమెకి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. జీవితంలో నీకు ఎదురుపడనని అనుకున్నా, అందుకే ఇన్నాళ్లు మీరు వెతికినా కనపడనంత దూరంగా వెళ్ళిపోయా అని మహేంద్రని ఉద్దేశించి, మనసులో అనుపమ అనుకుంటుంది. ఎందుకు నేను నీ నుండి, దూరంగా వెళ్ళిపోయానో నాకు మాత్రమే తెలుసు. కానీ నీ నుంచి దూరంగా వెళ్ళిపోయి తప్పు చేశానని బాధపడుతుంది అనుపమ.

Guppedantha Manasu October 25th Episode today
Guppedantha Manasu October 25th Episode

మహేంద్ర జగతి గతంలోని ఈ ప్లేస్ కి వచ్చారని, వసుధార కి అర్థమవుతుంది. మహేంద్ర కి గతం ఉందని, ఆ గతం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది వసుధార. రిషి కూడా తండ్రీలో మార్పు కనిపించకపోవడంతో భయపడిపోతాడు. నిద్రలో మహేంద్ర జగతి,, అను అంటూ కలవరిస్తాడు. అను ఎవరు అని అడుగుతాడు రిషి. ఏదైనా ఉంటే చెప్పమంటాడు. జగతి జ్ఞాపకాలు దహించివేస్తున్నాయి. ఇక్కడ ఉండలేను. ఇంటికి వెళ్ళిపోదామని మహేంద్ర అంటాడు. తండ్రి బాధ చూడలేక, రిషి స్వయంగా మందు బాటిల్ తీసుకువచ్చి ఇస్తాడు. తాగమని చెప్తాడు. ఒక గ్లాస్ తీసుకొస్తాడు. నాకు పొయ్యిమని అంటాడు.

మీలాగే నన్ను అమ్మ జ్ఞాపకాలు దహించవేస్తున్నాయి. వాటిని నేను మర్చిపోవాలి కదా అని అంటాడు రిషి. అక్కడికి వచ్చిన వసు రిషి చేతిలో నుండి, బాటిల్ లాగేసుకుంటుంది. తాగకూడదు. బానిస అవుతారని. ఇది కరెక్ట్ కాదని మహేంద్ర తో అంటుంది. మీరు చూడవలసిన జీవితం చాలా ఉంది. మా అందరికీ మార్గదర్శకంగా నిలవాలంటే, తాగుడు మానేయాలని అంటుంది. జగతిని తీసుకొస్తే మందు మానేస్తానని అంటాడు మహేంద్ర. రిషి వసుధారాని, తన రూమ్ నుండి వెళ్లిపోమని అంటాడు. రిషికి ఎస్ఐ ఫోన్ చేస్తారు. జగతిని షూట్ చేసిన కిల్లర్ కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్తాడు.

శత్రువులు ఎటాక్ చేసిన ప్రతిసారి, వసుధార వచ్చి కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. తన శత్రువులు ఆమెకి తప్పకుండా తెలిసి ఉంటుందని అనుకుంటాడు. తల్లి జగతి ప్రాణాలు తీసిన వాళ్ళు, ఎవరో చెప్పమని గట్టిగా అడుగుతాడు. శైలేంద్ర పేరు చెప్తే రిషి నమ్మడని వసుధార అనుకుంటుంది. ఎవరి పేరు చెప్పినా నమ్ముతానని చెప్పమని అంటాడు. నీకు ఎవరిపైన అనుమానంగా ఉంటే, వాళ్ల పేరు చెప్పమంటాడు. ఆమె మాత్రం సమాధానం చెప్పకుండా మౌనం గా ఉంటుంది. నా శత్రువు ఎవరో నీకు తెలుసా అని గట్టిగా అడుగుతాడు. తెలుసు అని చెప్తుంది. ఎవడు వాడు అని రిషి అడగగా మీ అన్నయ్య శైలేంద్ర అని చెప్తుంది. రిషి షాక్ అయిపోతాడు.

ఎందుకు నన్ను మా అన్నయ్య చంపాలని అనుకుంటాడు అని అడుగుతాడు. ఎండి సీట్ కోసం అని వసుధార చెప్తుంది. శైలేంద్ర చేస్తున్న కుట్రల గురించి, పెద్దమ్మకి తెలుసా అని అడుగుతాడు. ఇవన్నీ ప్లాన్ చేస్తున్నదే దేవయాని అని అంటుంది. జగతికి ఈ విషయం తెలిసి శైలేంద్ర, దేవయానిలను నిలదీసిందని కానీ మీ ప్రాణాలు తీస్తామని చెప్పి జగతిని బెదిరించారని, జరిగినవన్నీ కూడా వసుధార చెప్తుంది. వాళ్లే కారణమని ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదని వసుధారని రిషి నిలదీస్తాడు. వాళ్ళే నేరస్తులని తెలిసిన తన దగ్గర ఆధారాలు లేకపోవడంతో, ఇన్ని రోజులు చెప్పలేకపోయానని.. ఆధారాలు లేకుండా చెప్తే నమ్మరు అని వసుధార అంటుంది.

పెద్దమ్మ చాలా మంచిదని, తన మనసులో ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు ఉండవని.. ఆధారాలు లేకుండా వాళ్ళు నేరస్థులని ఎలా చెప్తావని అంటాడు. శైలేంద్రకి తను ప్రాణమని ఎండి సీట్ కావాలని నన్ను అడిగితే కాదనకుండా ఇచ్చేవాడిని అంటాడు. నువ్వేదో పొరపాటు పడుతున్నామని, వసుధార కి క్లాస్ ఇస్తాడు. వాళ్ల గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే, బాగోదు అని వార్నింగ్ కూడా ఇస్తాడు. మీ పెద్దమ్మ, అన్నయ్య మీరు అనుకున్నంత మంచి వాళ్ళు కాదని, నరరూప రాక్షసులని చెప్తుంది. ఆ మాటతో కోపం తట్టుకోలేక చెయ్యి చేసుకుంటాడు. చెంపపై గట్టిగా కొడతాడు. రిషి పిలవడంతో ఒక్కసారి వసుధార కలలో నుండి బయటకు వస్తుంది. నా శత్రువులు ఎవరో చెప్పమంటే, ఇంతలా ఆలోచిస్తావేంటని అడుగుతాడు. తొందరలోనే మీ శత్రువులు ఎవరో మీకు తెలుస్తుందని చెప్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now