Guppedantha Manasu October 20th Episode : జగతి ఆత్మ.. భయపడిన దేవయాని.. వసుధారపై మహేంద్ర సీరియస్..!

October 20, 2023 8:33 AM

Guppedantha Manasu October 20th Episode : మహేంద్ర లో మార్పు రావాలని, అరకు తీసుకువస్తారు రిషి, వసుధార. జగతితో తన ప్రేమకి పునాది పడిన చోటుకే వస్తారు. దీంతో, ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. తర్వాత ఏం జరిగిందనేది చూస్తే.. జగతి జ్ఞాపకాల నుండి, తండ్రి బయటపడాలంటే ప్లేస్ మారాలని రిషి అనుకుని తండ్రిని తీసుకుని, తాను వసుధార కొన్నాళ్ళు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు ఫణింద్ర తో రిషి చెప్తాడు. వాళ్లు కూడా వెంట వస్తామని, దేవయాని శైలేంద్ర అనుకుంటారు. వాళ్ళకి ఫణింద్ర క్లాస్ ఇస్తాడు. అయితే, ఈ ట్రిప్ లో ముగ్గురు మళ్ళీ తిరిగి రాకుండా అటు నుండి అటే పైలోకానికి పంపించాలని శైలేంద్ర మనసులో శపథం చేస్తాడు.

రిషి వసుధార మీద ఎటాక్ ప్లాన్ చేస్తాడు. మహేంద్ర ని తీసుకుని అరకు వస్తారు. రిషి వసుధార మత్తులో ఉన్న, మహేంద్ర కారు నుండి ఆ ప్లేస్ ని చూడగానే, షాక్ అయిపోతాడు. జగతి అని గట్టిగా పిలుస్తాడు. ఎందుకు ఇక్కడికి నన్ను తీసుకొచ్చావు అని రిషి ని నిలదీస్తాడు. ఇంకో చోటికి వెళ్దామని అంటాడు. ఈ ప్లేస్ మీకు తెలుసా అని అడుగుతారు. సమాధానం చెప్పడానికి మహేంద్ర తడబడతాడు. ప్రపంచంలో ప్రశాంతమైన ప్రదేశం మీకు ఇది ఒకటే కనపడిందా అని, మహేంద్ర బాధపడతాడు. ఈ ప్లేస్ బాగుందని, మహేంద్ర మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు రిషి.

జీవితం శూన్యం అయింది. అంతా చీకటి గానే కనపడుతోంది అని, మహేంద్ర అంటాడు. అమ్మని మర్చిపోవడం, ఆ బాధ నుండి బయటపడటం కష్టం. మనిషి జీవితం దుఃఖం దగ్గర ఆగిపోకూడదు అని రిషి చెప్తాడు. నాకు ఇన్ని చెప్తున్నావు కదా, నువ్వు నిజంగా ఆ బాధ నుండి బయట పడ్డావా, నీ నోటి నుండే ఆ మాటలు వస్తున్నాయా, మనసులో నుండి రావడం లేదా అని రిషి ని అడుగుతాడు మహేంద్ర. రూమ్ నుండి బయటకి వచ్చిన రిషి, తల్లి ఆలోచనలోనే ఉంటాడు. వసుధార వచ్చి, పచ్చదనంతో ఈ ప్లేస్ బాగుందని రిషితో మాట్లాడుతుంది.

Guppedantha Manasu October 20th Episode
Guppedantha Manasu October 20th Episode

ఇక్కడ ప్రకృతిని చూస్తుంటే, అమ్మ గుర్తుకు వస్తోందని, బాధగా సమాధానం చెప్తాడు. ప్రేమని అందివ్వలేకపోయానని ఎమోషనల్ అయిపోతాడు రిషి. జగతి మేడంకి ప్రేమని పంచలేకపోయారని బాధపడద్దని ఓదారుస్తుంది. మీరు సాధించిన విజయాలు జగతికి ఎన్నో మధురానుభూతాలుగా మిగిలిపోయినట్లు అంటుంది. మహేంద్ర లో మార్పు తీసుకురావడమే మన ముందు ఉన్న బాధ్యత అని రిషితో వసుధార అంటుంది. తండ్రి బాధను దూరం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అతను పడుతున్న ఆవేదన చూస్తుంటే, తండ్రి ఏమైపోతాడో అని భయమేస్తుంది అని రిషి అంటాడు.

కచ్చితంగా మహేంద్ర మారుతారని, అది మీ వల్ల సాధ్యమని రిషి కి చెప్తుంది. వసుధార గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటే, మహేంద్ర కూడా మిమ్మల్ని చూసి మారే అవకాశం ఉంటుందని వసుధార చెప్తుంది. మహేంద్ర లో మార్పు కోసం ఇద్దరు కలిసి ప్రయత్నించాలని అనుకుంటారు. చనిపోయి కూడా జగతి తన పంతాన్ని నెగ్గించుకుంది అని దేవయాని అంటుంది. జగతి దూరమైనా, తన కొడుకు శైలేంద్ర కి ఎండి సీట్ దక్కకపోవడంతో ఆమె ఎంతో బాధపడుతుంది.

నువ్వు మామూలు దానివి కాదు అని జగతి ఫోటోని చూస్తూ, మనసులోనే దేవయాని అనుకుంటుంది. నిన్ను అందుకే పైకి పంపించాము అని చెప్తుంది. అప్పుడే జగతి ఫోటోకి ఉన్న దండ ఊడి కింద పడుతుంది. దేవయాని భయపడిపోతుంది. జగతి ఆత్మగా మారి ఈ ఇంట్లోనే తిరుగుతోందని కంగారు పడిపోతుంది. శైలేంద్ర అప్పుడే వచ్చి, కాలేజీకి వెళ్తున్నానని తల్లికి చెప్తాడు. సిగ్గు లేదా అంటూ ఎగతాళి చేస్తుంది. నా ఇగో ని హర్ట్ చేస్తున్నావని తల్లితో అంటాడు శైలేంద్ర. నీ ఇగో ఇప్పుడు హర్ట్ అయిందేమో, నా ఇగో మాత్రం వసు ఎండి సీట్లో కూర్చున్నప్పుడే, హర్ట్ అయిందని కొడుకుతో దేవయాని అంటుంది.

నువ్వు సంతోష పడే క్షణాలు వస్తాయి అని తల్లికి శైలేంద్ర చెప్తాడు. త్వరగా ఆ క్షణాలని రప్పించమని అంటుంది. ఆ పని మీదే కాలేజీకి వెళ్తున్నానని, శైలేంద్ర అంటాడు. అప్పుడే అక్కడికి ఫణీంద్ర వస్తాడు. తాను కాలేజీకి వస్తున్నానని, కలిసి వెళ్దామని శైలేంద్ర తో చెప్తాడు తండ్రి తనతో పాటు వస్తానని అనడంతో, శైలేంద్ర కంగారు పడతాడు. నీ భార్యని సరిగ్గా చూసుకోవడం నీకు రాదు. కానీ. కాలేజీని ఎలా చూసుకుంటావు అంటూ కొడుకు మీద సెటైర్ వేస్తాడు ఫణీంద్ర. ఎక్కడైతే మన ప్రేమ ప్రాణం పోసుకుందో అదే ప్రదేశానికి రిషి తీసుకొచ్చాడు అని జగతి ఫోటో చూస్తూ, మహేంద్ర చెప్తాడు. మనం గడిపిన ప్రతి క్షణం కూడా. కంటి ముందు కనపడుతోందని, నిన్ను మర్చిపోవడం కలే అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.

నీకు నన్ను వదిలిపెట్టడం ఇష్టం లేదు. అందుకే, ఇక్కడికి రప్పించావని ఎమోషనల్ అయిపోతాడు. చుట్టుపక్కల మంచి ప్రదేశాలు ఉన్నాయి. చూడడానికి వెళ్దామని రిషి వసుధార తో మహేంద్ర కి వచ్చి చెప్తారు. తండ్రిని ఒంటరిగా వదలడానికి రిషి ఇష్టపడడు. వసుధార కూడా అదే అంటుంది. నువ్వు కరెక్ట్ గా మాట్లాడటం నేర్చుకోని వసుధార మీద మహేంద్ర సీరియస్ అవుతాడు. ఎందుకు వసుధారాణి కోపగించుకుంటున్నాడో రిషికి అర్థం కాదు. పెళ్లయిన తర్వాత కూడా రిషిని సార్ అనడం తప్పు అని వసుధార కి చెప్తాడు. ఇప్పుడు రిషి నీ భర్త అని చెప్తాడు. భర్తను ఏమని పిలవాలి అని అడుగుతాడు మహేంద్ర. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now