Guppedantha Manasu November 8th Episode : గ‌తం చెప్పేసిన రిషి, క‌ట్టుక‌థ‌ అనుకుంటున్న‌ ఏంజెల్, దేవయాని, శైలేంద్రకి ఫణింద్ర క్లాస్..!

November 8, 2023 8:47 AM

Guppedantha Manasu November 8th Episode : వసుధారతో మొదటి పరిచయంతోనే, ఇద్దరు మంచిగా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. చివరికి వసుధార కూడా తనని మోసం చేసిందని, ఆవేదనకి లోనవుతుంది ఏంజెల్. బాధ చూసి విశ్వనాథం తట్టుకోలేక పోతాడు. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని, బాధపడకు అని ఏంజెల్ ని ఓదారుస్తాడు. రిషి వసుధార గురించి ఆలోచించొద్దని, నిన్ను చూస్తుంటే గుండె బరువు ఎక్కినట్లు ఉంటుందని కంగారు పడతాడు. ఇలా ఎందుకు చేశాడు రిషి అని అడగాలి అని ఏంజెల్ అంటుంది. ఏంజెల్ కి ఏమని సమాధానం చెప్పాలో తెలియక, ఆలోచనలో పడతారు. ఏంజెల్ విశ్వనాథం లేకపోతే, ప్రాణాలతో ఉండేవాడు కాదని, రిషి అంటాడు. వాళ్ళ దగ్గర ప్రేమ విషయం దాచడం, బాధని కలిగిస్తుందని రిషి అంటాడు.

ఆమెని ఫేస్ చేసే ధైర్యం లేదని అంటాడు. అప్పుడు పరిస్థితులు కారణంగా, నిజం చెప్పే అవకాశం అప్పుడు లేదని వసుధార అంటుంది, అప్పుడు మన బంధం మీద, క్లారిటీ లేదని రిషి చెప్తాడు. నువ్వు అయినా మన ప్రేమ గురించి, ఏంజెల్ తో చెప్పాల్సింది అని వసుధార తో అంటాడు. వసుధార ఎప్పుడూ మీ మాటకే కట్టుబడి ఉంటుందని, అప్పుడు కనుక చెప్పినట్లయితే మీరు నన్ను అపార్థం చేసుకునేవారు.

మీరు బాధపడతారని నేను చెప్పలేదు అని వసుధార అంటుంది. జరిగిన వాటి గురించి ఆలోచించకుండా, ఫ్రెండ్షిప్ ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారో అది చేయండి అని రిషికి సలహా ఇస్తుంది. ఏంజెల్ అర్థం చేసుకుంటుందని రిషి అంటాడు. రిషి కోసం ఫణింద్ర తో పాటుగా దేవయాని, శైలేంద్ర కూడా వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంట్లో అడుగుపెట్టగానే, ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్లారు అంటూ మహేంద్రని ఆరా తీస్తూ ఉంటారు. రిషి విష్ కాలేజీ కి వెళ్లిన విషయం చెప్పకుండా మహేంద్ర దాచేస్తాడు. ఎక్కడికి వెళ్లారో చెప్తే తాను కూడా అక్కడికి వెళ్తానని శైలేంద్ర అంటాడు కానీ మహేంద్ర మాత్రం మౌనంగానే ఉంటాడు.

ఫణింద్ర జోక్యం చేసుకోని, శైలేంద్రకి క్లాస్ ఇస్తాడు ఇంటికి రమ్మని మహేంద్ర ని ఫణింద్ర దేవయాని కోరుతారు. దేవయాని మీద ఫైర్ అవుతాడు మహేంద్ర. జగతి లేని ఇంటికి రానని అంటాడు. ఫణింద్ర భోజనానికి పిలిచినా కూడా మహేంద్ర రానని అంటాడు. మహేంద్ర మీద సెటైర్ వేయబోతుంది దేవయాని. ఫణింద్ర జోక్యం చేసుకుని, శైలేంద్ర, దేవయానీలని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. మీ గురించి బాధపడే వాళ్ళు, ఇక్కడ ఎవరూ లేరని చెప్తాడు. ప్లాన్ రివర్స్ అవడంతో శైలేంద్ర తగ్గుతాడు.

Guppedantha Manasu November 8th Episode today
Guppedantha Manasu November 8th Episode

రిషి వసుధార విశ్వనాథం ఇంటికి వస్తారు. విశ్వనాథం ఏంజెల్ ని పెళ్లి చేసుకోమంటే తనకి ఇదివరకే పెళ్లి అయిందని రిషి చెప్తాడు. ఆ మాటలని గుర్తు చేస్తాడు విశ్వనాథం. ఇదివరకే నీకు పెళ్లి అయితే, వసుధారని ఎలా పెళ్లి చేసుకున్నావు అని అడుగుతాడు. అందుకు ఒక కారణం ఉందని విషయం చెప్తాడు. 15 రోజుల్లో నీ భార్య ఎవరో చూపించాలని, చేస్తున్న చాలెంజ్ కి భయపడే రిషి వసుధారని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటుంది. నా మనవరాలని నిన్ను పెళ్లి చేసుకునే అర్హత లేదని, నా మనవరాలని కించపరిచావు కదా అని, విశ్వనాథం కూడా బాధపడతాడు.

పెళ్లి అనుకోకుండా జరిగిపోయిందని, అంటారు. రిషి కి ఫ్యామిలీ ఉందని తెలిసి విశ్వనాథం ఏంజెల్ షాక్ అయిపోతారు. జగతి మేడం తన తల్లి అని చెప్తాడు. మహేంద్ర జగతి నాకు ఆత్మీయులని మీకు అబద్ధం చెప్పానని కన్న తల్లిదండ్రులని రిషి చెప్తాడు. వాళ్లు ఆశ్చర్యపోతారు. గతం గురించి రిషి మొత్తం చెప్పేస్తాడు. తను ఇంటికి ఎలా దూరం అయ్యాడు అనేది చెప్తాడు. భార్యను చూపిస్తానన్నప్పుడు ఎవరో కాదు ఆమె వసుధార అని అంటాడు. మా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినా విడిపోయినట్లు రిషి చెప్తాడు. పెళ్లికి రెడీగా ఉన్నా ఇద్దరం అనుకోకుండా విడిపోవలసి వచ్చింది అని, మా ప్రేమని బయటకి చెప్పుకోలేక మనసులో దాచుకోలేక కష్టాలు పడ్డామని అంటాడు. రిషి మాటల్ని ఏంజెల్ నమ్మదు. కట్టు కథ అనుకుంటుంది. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now