Guppedantha Manasu November 29th Episode : జ‌గ‌తి హ‌త్య కేసులో రిషిని నిల‌దీసిన అనుప‌మ.. క‌న్నీళ్లు పెట్టుకున్న వ‌సుధార..!

November 29, 2023 8:53 AM

Guppedantha Manasu November 29th Episode : వసుధార రిషి తెలివితేటలతో చిత్ర కేసు నుండి బయటపడుతుంది. ఆమెని జైలుకు పంపించాలన్న శైలేంద్ర వేసిన ఎత్తుని, రిషి చిత్తుగా చేసేస్తాడు. ఈ కేసు నుండి, బయటపడటంతో వసుధార బాగా ఎమోషనల్ అయిపోతుంది. ఏడుస్తుంది. రిషి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెడుతుంది. స్పెషల్ థాంక్స్ ఇలా చెప్పవా అని వసుధారిని అడుగుతాడు రిషి. నా వల్ల చిత్ర సూసైడ్ చేసుకుందని ఆమె తల్లిదండ్రులు చెప్పడం, నాకు వ్యతిరేకంగా ఆధారాలు ఉండడంతో, నా ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయినంత పని అయిందని వసుధార బాధపడుతుంది.

ఎంతో భయపడిపోయానని చెప్తుంది. నువ్వు భయపడ్డావ్ అంటే నమ్మశక్యంగా లేదని రిషి చెప్తాడు. యూత్ ఐకాన్ భయపడటం ఏంటా అని ఆట పట్టిస్తాడు. వసుధార అలుగుతుంది. ఒక అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించిందని, నిందని భరించలేకపోయాను అని అంటుంది. నువ్వు భయపడకు, నీ వెంట నేను వస్తాను వసుధారా అని చెప్తాడు. మీ మాట విన్నాక, మీ ముఖంలో నిబ్బరం చూసిన తర్వాత ధైర్యం వచ్చింది అని అంటుంది వసుధార. అనుపమ బెయిల్ తెప్పించారు. ఆమెకి ఒకరకంగా థాంక్స్ చెప్పాలి అని రిషి అంటాడు.

బెయిల్ విషయంలో, ఆమె సహాయం చేయబట్టే, నాకు ఆలోచనలు వచ్చాయి అని అంటాడు. అలా ఆలోచించే, క్రిమినల్స్ ని పట్టుకోగలిగానని విషయం చెప్తాడు. నీ పక్కన నేను ఉండగా, నిన్ను ఎవరు టచ్ చేయలేరని రిషి చెప్తాడు. రిషి భర్త మాత్రమే కాదు. నీ జీవితానికి, భవిష్యత్తుకి, సర్వస్వానికి కాపలా అని మాట ఇస్తాడు రిషి. మహేంద్ర అనుపమ కి ఫోన్ చేసి, ఇంటికి రమ్మంటాడు. కాలేజీ నుండి ఇంటికి వస్తున్న సమయంలో, చిత్ర కేసులో తనని ఇరికించింది ఎమ్మెస్సార్ అని వాసన్ చెప్పిన మాటలను వసుధార నమ్మదు. వసుధార ఇంకెవరో ఉన్నారని అనుకుంటుంది. ఎమ్మెస్సార్ ని పట్టుకుంటే నేరస్తుడు ఎవరో తెలుస్తుందని రిషి అనుకుంటాడు.

Guppedantha Manasu November 29th Episode today
Guppedantha Manasu November 29th Episode

వస్తూ వస్తూ రిషి, వసుధార కలిసి టీ తాగడానికి దిగుతారు. టీ స్టాల్ లో స్వయంగా, వసుధార టీ పెడుతుంది. అది చూసి ఓనర్ కూడా ఇంప్రెస్ అవుతాడు. రిషి ని గుర్తుపట్టిన టీ స్టాల్ ఓనర్ అతనితో సెల్ఫీ దిగాలని రిక్వెస్ట్ చేస్తాడు. మా పిల్లలు మీకు పెద్ద ఫ్యాన్ అని అంటాడు సెల్ఫీ వరకేనా, పెద్ద బ్యానర్ కట్టి, మీ కొట్టు ముందు పెడతారా అని, అతనితో వసుధారా అంటుంది. అప్పుడు అతను అవును అలా చేస్తే, గిరాకీ కూడా పెరుగుతుందని అంటాడు. అలాంటి పని చేయొద్దని రిషి అంటాడు. అనుపమకి మహేంద్ర థాంక్స్ చెప్తాడు.

నువ్వు వసుధారకి బెయిల్ ఇవ్వడం వలన, ఈ కేసు గురించి ఎంక్వయిరీ చేసే సమయం రిషికి దొరికిందని మహేంద్ర చెప్తాడు. ఈలోగా రిషి వస్తాడు. చిత్ర కేసులో అసలైన దోషులు దొరికారని అనుపమతో అంటాడు. తొందరగానే నీ భార్యపై వచ్చిన నిందను తుడిచేసావు. తన నిజాయితీని తొందరగానే నిరూపించావు. కానీ, మీ అమ్మని చంపిన వాళ్ళని పట్టుకోడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది అని అనుపమ అడుగుతుంది.

ఆమె ప్రశ్నతో రిషి షాక్ అవుతాడు. అమ్మని చంపిన వాళ్లని పట్టుకొని శిక్షించాలని నీకు అనిపించట్లేదా అని అంటుంది. అలానే, నీ భార్యని చంపిన వాళ్లని ఎందుకు పట్టుకోగలిగావు అని గట్టిగా మహేంద్రని అడుగుతుంది అనుపమ. అమ్మ కేసులో క్లూ దొరకకపోతే అలా వదిలేస్తావా అని అనుపమ అంటుంది. జగతి విషయంలో ఏం చేయలేదని, మీరు చాలా అపోహ పడుతున్నారని, అనుపమ కి చెప్తాడు.

పైకి మామూలుగా కనబడుతున్నా లోపల కృంగిపోతున్నానని రిషి బాధపడతాడు. చెప్పినా, చెప్పకపోయినా నేను హంతకుడిని పట్టుకుంటాను. ఒక స్నేహితురాలి గానే మీకు ఇంత బాధ ఉంటే జగతి నాకు జన్మనిచ్చిన తల్లి అని బాధ నాకు ఉండదా..? అమ్మకి న్యాయం జరిగి తీరుతుంది అది అంటాడు రిషి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now