Guppedantha Manasu November 27th Episode : రంగంలోకి దిగిన రిషి.. కేసు నుంచి బ‌య‌ట‌ప‌డిన వసుధార.. శైలేంద్ర‌కు రివ‌ర్స్ పంచ్‌..!

November 27, 2023 8:55 AM

Guppedantha Manasu November 27th Episode : అనుపమ బెయిల్ ఇప్పిస్తుంది. వసుధార జైలు నుండి బయటకి వస్తుంది. ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే, వసుధార కంటతడి పెట్టుకుంటుంది. రిషి మహీంద్రా ఓదారుస్తారు. నువ్వు తప్పు చేసింది. మేము నమ్మట్లేదు అని చెప్తారు. నా వల్ల కాలేజీ పేరు పేపర్లు, టీవీల లోకి ఎక్కిందని నా వల్ల మీరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారని బాధపడుతుంది వసుధార. సీసీటీవీ ఫుటేజ్ లో, నువ్వు వాళ్ళకి వర్కింగ్ ఇస్తున్నట్లుగా ఉందని రిషి అంటాడు. అసలు చిత్ర నీకు ఎందుకు మెసేజ్ చేసింది, నువ్వు ఎందుకు వెళ్లావు అని రిషి అడుగుతాడు. అప్పుడు జరిగింది వసుధార రిషితో చెప్తుంది. ప్లీజ్ హెల్ప్ మీ మామ్ అని వసుధార మొబైల్ నుండి మెసేజ్ వస్తుంది.

అందుకని కంగారుపడి వెళ్తుంది. వసుధార తాను ఆ మెసేజ్ పంపించలేదని, వసుధారతో చిత్ర అంటుంది. సడన్గా అక్కడికి ఆమె లవర్ ఎంట్రీ ఇస్తాడు. నేనే పంపించాను అని వసుధారతో చెప్తాడు. మీరు ఏం చేసినా, ఆమెని వదిలిపెట్టలేనని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. చిత్ర జోలికి రావద్దని వసు ఎంత చెప్పినా, ఆమె లవర్ మాత్రం మాటలని పట్టించుకోడు. చిత్ర పేరెంట్స్ ని కూడా ఒప్పిస్తాడు.

తమ కూతుర్ని కాకుండా చిత్ర లవర్ కి వాళ్లు సపోర్ట్ ఇస్తారు. అతను మంచివాడని, వాళ్ళు చెప్తున్నారు. వసుధార కాళ్లపై పడి నాకు చిత్ర కావాలి, తనని ప్రేమించేలా ఆమెని ఒప్పించమని బతిమిలాడుతాడు. చిత్రా తల్లిదండ్రులు కూడా వసుదరకి దండం పెట్టి ఒప్పించమని చెప్తారు. మీరు ఇలా టార్చర్ చేస్తే, అందర్నీ జైల్లో పెడతానని వార్నింగ్ ఇస్తుంది వసుధార. వార్నింగ్ కి భయపడి చిత్ర లవర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చిత్రకి వ్యతిరేకంగా, ఏ నిర్ణయం తీసుకోవద్దని ఆమె తల్లిదండ్రులు కి హెచ్చరించి, అక్కడ నుండి వచ్చేస్తుంది వసుధార.

Guppedantha Manasu November 27th Episode today
Guppedantha Manasu November 27th Episode

ఇదే అక్కడ జరిగిందని రిషికి వసుధార చెప్తుంది. తనకి ఒక మాట చెప్పి, చిత్ర ఇంటికి వెళితే బాగుండేదని, వసుధారతో రిషి అంటాడు. ఈ కేసుకి వసు కి సంబంధం లేదని నిరూపణ అవ్వాలంటే, చిత్ర కోలుకోవడం ఒక్కటే మార్గం అని రిషి అంటాడు. శైలేంద్ర వచ్చి, నన్ను పట్టుకోవడం ఎవరివల్లా కాదని తల్లితో ఫోన్లో చెప్తాడు. నువ్వు ఇక్కడ లేకుండానే మన చేతికి మట్టి అంటకుండానే వసుధారని కేసులో ఇరికించావు బాగా అని కొడుకు శైలేంద్ర ని ప్రశంసిస్తుంది. ఔట్ స్టేషన్ లో ఉన్నాను కాబట్టి నాపై ఎవరికి అనుమానం వచ్చే ప్రసక్తే లేదని చెప్తాడు శైలేంద్ర.

అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న బయటకు లాగుతానని వసుధారతో రిషి అంటాడు. ఒకవేళ ఆధారాలు దొరకకపోతే, పోలీస్ పాత్ర వహించి మొత్తం కుట్రని బయటపెడతానని, బలంగా రిషి చెప్తాడు. ఈసారి జాగ్రత్తగా ఉండాల్సింది నా కొడుకు కాదు. శత్రువులు అని చెప్తాడు మహేంద్ర. రిషి దెబ్బకి వాళ్లు కి అచ్చు పడిపోవడం ఖాయమని మహేంద్ర చెప్తాడు. అర్ధరాత్రి వసుధార కి మెలకువ వస్తుంది. పక్కన రిషి కనపడడు. కంగారుపడుతుంది. మహేంద్ర ని నిద్ర లేపి, రిషి ఎక్కడకి వెళ్ళాడో తెలుసా అని అడుగుతుంది. తనకి తెలియదని మహేంద్ర అంటాడు.

ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది అని అంటుంది. రుశేంద్రభూషన్ని ఎదిరించాలంటే అడవిలో ఉన్న సింహంతో వేటకు దిగినట్లే, అని మహేంద్ర అంటాడు. హాస్పిటల్ లో ఉన్న చిత్రను చంపడానికి ఆమె లవర్ ముసుగు వేసుకుని వెళ్తాడు. బెడ్ పై ఉన్న, వాళ్ళను కత్తితో పొడుస్తాడు. కానీ, అతను స్థానంలో అక్కడ పిల్లో ఉంటుంది. సడన్ గా అక్కడికి రిషి ఎంట్రీ ఇస్తాడు. నాకు ముందు నుండి, నీ మీద డౌట్ ఉంది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను అని చెప్తాడు రిషి.

ఆ ముగ్గురు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. చిత్ర లవర్ ని రిషి పట్టుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే రిషి ని నిలదీస్తారు. చిత్ర తల్లిదండ్రులు నా కూతురు సూసైడ్ ఎటెంప్ట్ చేసుకోవడానికి కారణం నీ భార్య వసుధార అని అంటారు. పోలీసులు కూడా చిత్ర ని వసుధార రుషి కిడ్నాప్ చేశారని అనుమానిస్తారు. చిత్ర తండ్రి వీడియో కాల్ ద్వారా దేవయాని, శైలేంద్ర చూస్తారు. చిత్ర ఇక్కడే ఉందని చెప్తాడు. చిత్రను తీసుకుని మహేంద్ర వస్తాడు. కూతుర్ని చూసి చిత్ర తల్లిదండ్రులు షాక్ అయిపోతారు. దేవయాని కూడా కంగారుపడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now