Guppedantha Manasu November 25th Episode : వసుధార అరెస్ట్.. ట్విస్ట్ ఇచ్చిన అనుపమ.. రిషి చేసిన ఛాలెంజ్..!

November 25, 2023 9:00 AM

Guppedantha Manasu November 25th Episode : వసుధార వల్లే ఇలా జరిగిందని, వసుధారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మీరే కావాలని చేశారా..? ఎందుకు ఇలా చేశారు అని మీడియా ప్రశ్నలతో వేధిస్తూ ఉంటుంది. ఇంతలో, అలా ఎలా చేయగలిగావని అనుపమ అడుగుతుంది. ఒక అమ్మాయి అయి ఉండి, మరో అమ్మాయికి ఎలా ఇలా చేసావు..? ఎండి సీట్ కోసం ఏమైనా చేస్తావా..? ఇలా ఎన్నో మాటలు అంటుంది. అనుపమ నేనేమీ చేయలేదు. చిత్ర మెసేజ్ చేసి రమ్మంటేనే, వెళ్లానని వసుధార అంటుంది. ఆ మెసేజ్ చూపించు అని అనుపమడుగుతుంది. వసుధార మొబైల్ తీసుకుని చూస్తుంది. కానీ, అందులో మెసేజ్ లు ఉండవు.

మెసేజ్ లు అన్ని డిలీట్ అయినట్లు చూపిస్తుంది మేడం అని వసుధార అంటుంది. ఇదంతా నువ్వు కావాలనే చేసావు. ఎండి సీటుకి అర్హురాలు తెలుసుకోవచ్చా ఇంకే చూస్తున్నారు ఎస్సై గారు తీసుకెళ్లండి అని అనుపమ చెపుతుంది. వసుధారను పోలీసులు తీసుకెళ్తారు. రిషి మహేంద్ర లో పోలీస్ స్టేషన్ కి వెళ్తుంటే, అనుపమ అడ్డుపడుతుంది. నేను ఇలా అసలు ఊహించలేదు. వసుధార చేస్తుందని అనుకోలేదు అని అంటుంది. వసుధార గురించి మాకు తెలుసు. మిషన్ ప్రాజెక్టు ద్వారా ఎంతో మంది అమ్మాయిలకి జీవితం ఇచ్చింది.

నిజానికి చూసిన దానికి తెలిసిన దానికి తేడా ఉంది అని రిషి చెప్తాడు. వసుధార గొప్పతనాన్ని చెప్పాలని మీరు కూడా ప్రయత్నం చేయొద్దు అని చెప్తుంది అనుపమ. వసుధారని ఏమైనా అంటే. జగతిని అవమానించినట్లే. వసుధార జగతి శిష్యురాలు. వసుధారను అంటే జగతిని వేలెత్తి చూపినట్లే అని అనుపమకి మహేంద్ర చెప్తాడు. పోలీసులకి ఫోన్ చేసినా కూడా ఎలాంటి సహాయం చేయమని చెప్తారు.

Guppedantha Manasu November 25th Episode today
Guppedantha Manasu November 25th Episode

వసుధార పోలీస్ స్టేషన్ లోనే ఉండాలని, టెన్షన్ పడిపోతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈమెను ఓదారుస్తాడు. వసుధారాణి వదిలిపెట్టమని, బెయిల్ తెచ్చుకుంటామని మహేంద్ర అడుగుతాడు. బయలు వచ్చాక వదిలేస్తామని అంటాడు పోలీస్. అప్పుడు మీపై నింద వేసాను కదా, ఆ పెయిన్ తెలియడానికి నాకు ఇలా జరిగిందని అంటుంది. ఒక లాయర్ వచ్చి వసుధరకి బెయిల్ అని ఎస్సైతో చెప్తాడు. మేడం మీరు వెళ్లొచ్చు అని ఎస్సే చెప్తాడు. సర్ మీరు ఎవరు అని రిషి అడిగితే. నన్ను అనుపమ గారు పంపించారు అని చెప్తాడు. రిషి, మహేంద్ర షాక్ అయిపోతారు.

బయటకి వచ్చి చూస్తే అనుపమ ఉంటుంది. మహేంద్ర. రిషి థ్యాంక్స్ చెప్తారు జగతిని అవమానించినట్లే జగతి శిష్యురాలు అని చెప్పారు కదా అందుకే బెయిల్ ఇప్పించాను అని అనుపమ చెప్తుంది. నాకు తెలిసి జగపతి గుణం మంచితనం ఇంకెవరికి ఉండవు. కానీ వసుధారకి ఒక అవకాశం ఇచ్చాను అది మీరు నిరూపించుకోండి. వసుధార నేరం చేసిందనే కోణంలో నుండి బయటకి రండి అని అంటాడు.

బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదని అనుపమ అంటే, జైల్లోకి వెళ్లిన వారంతా దోషాలు కాదని చెప్తాడు. మనం నమ్మినట్లు వసుధారాణి అంతా నమ్మాలి అని లేదు. ఏమైనా నువ్వు చేసిన దానికి థాంక్స్ అని మహేంద్ర అంటాడు. నేను చేసింది సహాయం కాదు. నేరస్థులకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. అయినా చిత్ర బాగుండాలని. దేవుడిని మొక్కుకోండి. ఇప్పుడు అమ్మాయి ఇచ్చే స్టేట్మెంట్ మీద వసుధార జీవితం ఆధారపడి ఉంది అని చెప్తుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now