Guppedantha Manasu November 22nd Episode : పాత జ్ఞాప‌కాల్లో మునిగిపోయిన అనుప‌మ‌.. మ‌హేంద్ర, ధరణి మీద ప్రేమ చూపిస్తూ శైలేంద్ర నాట‌కం..!

November 22, 2023 9:19 AM

Guppedantha Manasu November 22nd Episode : రిషి, మహేంద్ర వలన జగతి చనిపోయిందని, అనుపమ అపోహ పడుతుంది. ఎంక్వయిరీలో భాగంగా, రిషి, మహేంద్రల మీద, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆమె ప్రశ్నలకు ఇద్దరూ బాధపడతారు. ఇంకోపక్క అనుపమను శైలేంద్ర ఫాలో అవుతాడు. తర్వాత తన భార్య చేతిలో తన్నులు తింటాడు. అనుపమలా గట్టిగా మాట్లాడే వాళ్ళు, నిలదీసే వాళ్ళు లేక అమ్మకి దూరమయ్యానని, తండ్రితో చెప్తాడు రిషి అమ్మ బతికి ఉన్నప్పుడే అనుపమ మన జీవితాల్లోకి వస్తే, పరిస్థితిలో వేరేలా ఉండేవని రిషి బాధపడతాడు. అనుపమ మాటలు కఠినంగానే ఉన్నా, అమ్మ మీద తనకి ఉన్న ప్రేమ కనపడుతోందని తండ్రితో చెప్తాడు.

కొడుకు మాటలు విని మహేంద్ర నార్మల్ అవుతాడు. అనుపమ తో మాట్లాడాలని అనుకుంటాడు. వసుధారతో మాట్లాడుతున్నట్లుగానే నటిస్తూ, ఎంక్వయిరీ కొనసాగిస్తుంది అనుపమ. స్టూడెంట్ గా కాలేజీలోకి అడుగుపెట్టి, రిషి ని లైన్ లో పెట్టి ఇప్పుడు కాలేజీ కి వసుధార ఎండి అయిందని, వసుధార గురించి దేవయాని అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నీకంటే ముందు ఎండిగా ఎవరున్నారని వసుధారని అనుపమ అడుగుతుంది. జగతి అని వసుధార చెప్తుంది.

ఆమె స్థానాన్ని నువ్వు భర్తీ చేసావా అని మరో ప్రశ్న అడుగుతుంది అనుపమ. జగతి మేడం ప్లేస్ ని నేను భర్తీ చేయలేను అని చెప్తుంది. డబ్బు, హోదాలలో దేనికి ప్రాముఖ్యత ఇస్తావని అనుపమ అడిగిన మాటలకి, ఆ రెండిటి కంటే ప్రేమకే ప్రాధాన్యతను ఇస్తానని వసుధార చెప్తుంది. డబ్బు మనిషికి అవసరం మాత్రమే. హోదా మనిషిలో ఉండే భావన మాత్రమే అని చెప్తుంది. ఏది ఏమైనా నీకు తెలియకుండానే, నువ్వు ఎండి అయ్యావు అంటావు అంతేనా అని వసుధారతో అంటుంది అనుపమ.

Guppedantha Manasu November 22nd Episode today
Guppedantha Manasu November 22nd Episode

మేడం నాకు ఎంతో. మీరు కూడా అంతే అని వసుధార అంటుంది. వసుధార చాలా తెలివైన అమ్మాయని అనుపమ అనుకుంటుంది. అనుపమ మహేంద్ర పోటీపడి ఒకరికి ఇష్టమైన వంటకాలను ఇంకొకరు వసుధారకి చెప్తారు. వాటిని సిద్ధం చేయమని ఆమెతో అంటారు. ధరణి వంట పనుల్లో బిజీగా ఉంది. ధరణి వద్దకు వచ్చిన శైలేంద్ర ఆమె మీద ప్రేమను కురిపిస్తాడు. నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నాను అని బాధపడతాడు. భర్త చేస్తున్నది నటన అని తెలుసుకోలేక పోతుంది ధరణి.

ఒకప్పుడు ఇంటి పనులు కష్టంగా అనిపించేవి కానీ నన్ను ఇష్టపడటం మొదలుపెట్టాక ఇష్టంగా ఈ పనులు చేస్తున్నానని శైలేంద్ర తో ధరణి చెప్తుంది. ఆ తర్వాత ధరణి కోసం చీరను బహుమతిగా తీసుకొస్తాడు శైలేంద్ర. ఆ గిఫ్ట్ ని చూసి ధరిని పొంగిపోతుంది. ధరణి కంట తడి పెట్టుకుంటుంది. ఆడవాళ్ళకి భర్త చూపించే ప్రేమ ఎక్కువైతే ఇలాగే కన్నీళ్లు వస్తాయి అని చెప్తుంది. ఇంకోసారి ఇలా ఏడిస్తే బాగోదని ధరణితో శైలేంద్ర చెప్తాడు. మనస్పూర్తిగా చెప్తున్నాను నా గుండెల్లో నువ్వు వున్నావు అని అంటాడు.

వసుధార భోజనాన్ని ప్రిపేర్ చేస్తుంది. మహేంద్ర స్వయంగా అందరికీ వడ్డిస్తాడు. మహేంద్ర ప్లేట్ లో అన్నం తక్కువగా ఉండడంతో, అనుపమ ఇంకొంచెం వడ్డిస్తుంది. ఒకళ్ళ మీద ఇంకొకరు జోకులు వేసుకుంటారు. పంచులు వేసుకుంటారు. అవన్నీ రిషి, వసుధార చూసి హ్యాపీ అవుతారు. మీ భర్త ఏం చేస్తారని అనుపమని అడుగుతుంది, మీకు పిల్లలు ఎంతమంది, ఏం చేస్తారు అని అడుగుతుంది. కానీ అనుపమ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది.

ఆ టాపిక్ ని మహేంద్ర డైవర్ట్ చేసేస్తాడు. వసుధారపై రిషి సీరియస్ అయిపోతాడు. తనకి సంబంధించిన ఇస్హాతాలు అన్ని మహేంద్ర గుర్తుంచుకోవడం చూసి అనుపమ ఆశ్చర్య పోతుంది. అందరికీ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయే ముందు, పెళ్లి చేసుకోలేదని ఒంటరిగానే ఉన్నానని వసుధారతో అనుపమ చెపుతుంది. మీ మేడం పెళ్లి చేసుకుని ఒంటరిగా ఉందని అంటుంది. ఆమె మాటలతో మహేంద్ర హర్ట్ అవుతాడు. మళ్లీ ఇంటికి రావద్దని చెప్పి మహేంద్ర సీరియస్ అవుతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now