Guppedantha Manasu November 17th Episode : రిషికి ప్రామిస్ చేసిన మ‌హేంద్ర.. మంచివాడిగా శైలేంద్ర.. క‌న్ఫ్యూజ‌న్‌ లో ధరణి..!

November 17, 2023 8:40 AM

Guppedantha Manasu November 17th Episode : జగతి జ్ఞాపకాలతో, మహేంద్ర మందుకు బానిసగా మారడాన్ని రిషి సహించలేక పోతాడు. ఇకమీదట ఎప్పుడూ తాగనని ఒట్టు వేయమంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూస్తే జగతి చావుకి కారణం ఎవరు అనేది తెలుసుకోవాలని అనుకుంటుంది. ఆ సీక్రెట్ కనిపెట్టడానికి బయలుదేరుతుంది అనుపమ. ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి, సిద్ధమవడంతో విశ్వనాథం కంగారు పడతాడు. తనతోనే ఉండమని అంటాడు. ఎందుకు వెళ్తున్నాను అనేది మాత్రమే తనకి తెలుసునని ఎక్కడ ఉండాలనేది తెలియదని విశ్వనాథంతో అనుపమ చెపుతుంది. ఏంజెల్ ని తోడుగా తీసుకెళ్ళమని అనుపమకి చెప్తాడు. జీవితంలోనే తాను ఒంటరిగానే మిగిలిపోయానని, ఇప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తానని అంటుంది అనుపమ. వెంట తను వస్తానని ఏంజెల్ అంటుంది.

కానీ అనుపమ వద్దని అంటుంది. ఏంజెల్ కి నీ బుద్ధులే వస్తున్నాయని అనుపమతో విశ్వనాథం అంటాడు. నీ జీవితం నాలా ఒంటరిగా మిగిలిపోకూడదని సలహా ఇస్తుంది అనుపమ. ధరణి, శైలేంద్ర బట్టల్ని ఐరన్ చేస్తుంది ఆమె దగ్గరికి కాఫీ కప్ తో వస్తాడు శైలేంద్ర. ఇకనుండి ఇంటి పనులు అన్ని నువ్వే చేయాల్సిన అవసరం లేదు అని ప్రేమని కురిపిస్తాడు. ధరణి కోసం కాఫీ ని తీసుకువస్తాడు. ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నాను అని ధరణితో అంటాడు శైలేంద్ర. సడన్గా భర్తకి తనమీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అని ధరణి షాక్ అయిపోతుంది.

శైలేంద్ర ఎందుకు మారాడు అనే దాని వెనుక ఏదో కుట్ర ఉంది అని అనుకుంటుంది. ధరణి ఆలోచనలు శైలేంద్ర కనిపెడతాడు తండ్రి పనింద్ర అన్న మాటలు నన్ను కలచివేసాయని, ఇన్నాళ్లు ఎంత బాధ పెట్టానో అర్థం అయిందని, తండ్రి మాటలతో అర్థమైందని, ధరణితో అంటాడు శైలేంద్ర. ఇకపై నిన్ను కసురుకోనని చెప్తాడు. నిన్ను మా అమ్మ తిట్టినా సహించలేనని అంటాడు. నీతో పాటు ఎంతోమందికి అన్యాయం చేశానని, అవన్నీ తన మనసుని కలచివేస్తున్నాయని, ధరణితో చెప్తాడు శైలేంద్ర. శైలేంద్ర నిజంగా మారిపోయాడో లేదో అర్థం కాని కన్ఫ్యూషన్లో పడిపోతుంది ధరణి. మీరు మాట్లాడుతుంది నిజమేనా అని భర్తని అడుగుతుంది అక్కడే ఉన్న ఫణింద్ర నా కొడుకులో వచ్చిన మార్పును చూసి సంతోషపడతాడు.

Guppedantha Manasu November 17th Episode today
Guppedantha Manasu November 17th Episode

నువ్వు ఇలాగే ధరణి తో సంతోషంగా ఉండాలని అంటాడు. ఇకనుండి ధరణి సంతోషాలు బాధలు పంచుకోవాలని తనపై పెత్తనం చెలాయించకుండా గౌరవించాలని శైలేంద్ర కి సలహా ఇస్తాడు ఫణింద్ర. శైలేంద్ర ఆడుతోంది నాటకం అని ఫణింద్ర తెలుసుకోలేక పోతాడు శైలేంద్ర యాక్టింగ్ చూసి దేవయాని కంగారు పడిపోతుంది. కొడుకు నిజంగా మారిపోయాడు ఏమో అని కలవరపడుతుంది. కొడుకుకి పోటుగా యాక్టింగ్ మొదలు పెడుతుంది. జగతి చావు వెనక మీ ప్రమేయం ఉందా అని, భర్త అన్న మాటలకి హర్ట్ అవుతున్నట్లుగా నటిస్తుంది. వాళ్ల నటనని ఫణింద్ర నిజమని అనుకుంటాడు. నువ్వు కూడా మారడానికి ప్రయత్నించు అని దేవయానితో ఫణింద్ర చెప్తాడు.

మహేంద్ర అనుపమ అన్న మాటలు తట్టుకోలేక పోతాడు బతికున్నళ్ళు జగతిని దూరం పెట్టావు. చనిపోయిన తర్వాత ఆమెని మర్చిపోలేక పోతున్నానని నాటకం ఆడుతున్నావా అని మహేంద్ర పై ఫైర్ అవుతుంది అనుపమ. ఆమె అడిగిన ప్రశ్నలు పదేపదే గుర్తు రావడంతో బాధలో మునిగిపోతాడు మహేంద్ర. ఆ బాధని మర్చిపోవాలంటే తాగడం ఒక్కటే పరిష్కారం అని అనుకుంటాడు. ఒకవైపు జగతి చనిపోయిన బాధ, ఇంకో వైపు కొన్ని చూపులు ప్రశ్నలు బాధిస్తున్నాయని రిషి కి చెప్తాడు. మహేంద్ర అనుపమ గురించి ఆలోచించి మీరు ఎక్కువ తాగుతున్నారని రిషి అంటాడు. ఎవరు జగతిని గుర్తు చేసిన తట్టుకోలేకపోతున్నానని, మహీంద్రా ఎమోషనల్ అవుతాడు.

మీరు తాగుతున్నది రిషి ఆయుష్షు అని గుర్తు పెట్టుకోండి అని మహేంద్రతో అంటాడు రిషి. మా కలల్ని ఆశయాన్ని కూడా మీరు దూరం చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి అని అంటాడు. మీరు తాగడం వలన ఆనందం దూరం అయిపోతుంది. మా జీవితం మాకు కాకుండా పోతుంది అని రిషి అంటాడు. మేము సంతోషంగా బతకాలని మీరు అనుకుంటున్నారు కానీ మీరు తాగితే మేము ఆనందంగా ఉండలేము అని మహేంద్ర తో రిషి చెప్తాడు.

మీకు భార్య దూరమైంది. నాకు అమ్మ దూరమైంది. మరి నేను అలా భరిస్తున్నానని, తండ్రిని నిలదీస్తాడు రిషి. అమ్మ కోరిక తీర్చడం కోసం, పెళ్లి కూడా చేసుకున్నానని అంటాడు. అమ్మ దూరమైపోయిందని బాధలో నేను కూడా తాగాలా అని తండ్రిని అడుగుతాడు. బాధకి మందు తాగడం పరిష్కారం కాదని మహేంద్ర ఒట్టు వేయమని తండ్రితో అంటాడు. ఇక ఎప్పుడు తాగానని కొడుకుకి మహేంద్ర మాట ఇస్తాడు. కాలేజీకి రెగ్యులర్ గా వెళ్ళమని మునుపటి మహేంద్రలా ఉండమని తండ్రిని అడుగుతాడు. వసుధారా కూడా బతిమిలాడడంతో ఒప్పుకుంటాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now