Guppedantha Manasu December 7th Episode : రిషి కోసం వెతుకుతున్న వసుధార.. అనుప‌మ‌కు మ‌హేంద్ర క్లాస్.. దేవ‌యానికి మొదలైన టెన్ష‌న్‌..!

December 7, 2023 9:57 AM

Guppedantha Manasu December 7th Episode : రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో, వసుధార టెన్షన్ పడిపోతుంది. పరిస్థితిని అర్థం చేసుకోకుండా, అనుపమ వసుధారని ఇబ్బంది పెడుతోంది. అది చూసి మహేంద్ర ఫైర్ అవుతాడు. రిషి కనబడకపోతే కూల్ గా ఎలా ఉన్నావని, మహేంద్ర తో అనుపమ అంటుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి, కంప్లైంట్ ఇవ్వమని చెప్తుంది. రిషి చిన్నపిల్లడేం కాదని మహేంద్ర అంటాడు. అతను కనపడకుండా పోయి ఒక్క రోజు కూడా కాలేదని అంటాడు. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు, రిషి బయటికి వెళ్లి మళ్లీ తానే రెండు రోజులు మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చేవాడని, అనుపమతో అంటాడు మహేంద్ర.

జగతి లేని టైంలోనే, అలా జరిగి ఉంటుందని, జగతి ఉంటే అలా వెళ్ళనిచ్చేది కాదని అనుపమంటుంది. జగతి ఉన్నప్పుడు, రిషి కోసం తన పడిన తాపత్రయం చూసి ఉంటే బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం ఏంటో అర్థం అయ్యేదని మహేంద్రకి క్లాస్ తీస్తుంది. వసుధార చాలా టెన్షన్ పడుతోందని, ఆమె కోసమైనా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని మహేంద్ర కి చెప్తుంది అనుపమ. ఈ రాత్రి చూసిన తర్వాత రోజు ఉదయాన్నే పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని మహేంద్ర చెప్తాడు.

వసుధార బేలగా మారిపోవడం చూసి అనుపమ కంగారు పడిపోతుంది. ఎప్పుడూ ఇలా చూడలేదని వసుధారతో అంటుంది. చాలా ధైర్యంగా మాట్లాడుతుంటావు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పాజిటివ్ గా ఉంటావు. కానీ రిషి కనబడకపోయేసరికి ఇలా దిగులుపడటం నచ్చలేదు అని ధైర్యం చెబుతుంది. రిషి తనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్లాడని వసుధార ఆలోచనలో పడుతుంది. అతడు పంపించిన మెసేజ్ మళ్లీ చదువుతుంది. ఎలాంటి క్లూ కూడా ఉండదు. శైలేంద్రను చూడడానికి రిషి హాస్పిటల్ కి వచ్చాడా అని ధరణికి ఫోన్ చేసి అడుగుతుంది. రాలేదని ధరణి చెప్తుంది. రిషి గురించి అనుపమ ఎంక్వయిరీ చేయడం మొదలు పెడుతుంది. రిషి కనబడకపోవడానికి శైలేంద్ర మీద అటాక్ జరగడానికి ఏమైనా సంబంధం ఉందేమోనని మహేంద్రని అడుగుతుంది.

Guppedantha Manasu December 7th Episode today
Guppedantha Manasu December 7th Episode

అనుపమతో ఏం మాట్లాడితే ఏ గొడవలు వస్తాయో అని కంగారు పడిపోతాడు మహేంద్ర. ఏదైనా తెలిస్తే, నువ్వు కుదురుగా ఉండవని క్లాస్ తీసుకుంటాడు. అందుకేనా హాస్పిటల్ కి రావద్దని చెప్పావు. అందుకేనా శైలేంద్ర గురించి నాకు చెప్పలేదు అని మహేంద్రని అనుపమ నిలదీస్తుంది. ముకుల్ ఫ్యామిలీ మెంబర్ అని నన్ను పరిచయం చేసి, కేసు విషయాలు చెప్పొద్దని ఎందుకు చెప్పావు అని గట్టిగా అడుగుతుంది. కానీ ఆమె ప్రశ్నకి మహేంద్ర సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉండిపోతాడు.

రిషి మిస్సింగ్ గురించి ఆలోచించి అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి అనుపమ వెళ్ళిపోతుంది. ఫణింద్ర ని చూసి దేవయాని టెన్షన్ పడుతుంది. జగతి కేసు విషయంలో, శైలేంద్ర వాయిస్ దొరకడం గురించి ఆలోచిస్తున్నాడేమోనని భయపడిపోతుంది. ఆమె ఊహించిందే జరిగింది. జగతి మర్డర్ విషయంలో శైలేంద్ర వాయిస్ విషయం కలవర పెడుతుందని దేవయానితో ఫణింద్ర అంటాడు. శైలేంద్ర హత్య చేశాడని మీరు నమ్ముతున్నారా అని అడుగుతుంది. నమ్మకాలతో చట్టానికి పనిలేదు. సాక్షాలు మాత్రమే కావాలి అని ఫణింద్ర అంటాడు. ఆ తర్వాత ధరణి ద్వారా రిషి కనిపించట్లేదని తెలిసి ఫణింద్ర కంగారు పడతాడు.

ఉదయాన్నే వసుధార కనపడదు. మహేంద్ర భయపడతాడు. అప్పుడే అనుపమ వస్తుంది రిషి ఇంటికి రాలేదు ఇప్పుడు వసు కూడా కనపడలేదని మహేంద్ర భయపడతాడు. వసుధారకు ఫోన్ చేస్తాడు. రిషి కోసం వెతుకుతున్నానని ఆమె సమాధానం చెప్తుంది. రిషి కనపడలేదని వసుధార ఎమోషనల్ అవుతుంది. పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడమే మంచిది అని ముకుల్ కి ఫోన్ చేస్తాడు. రిషి ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అని చెప్తాడు. ముకుల్ ఆలోచనలో పడతాడు. వసుధార వెతుకుతూ ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now