Guppedantha Manasu December 5th Episode : షాక్ లో దేవయాని.. కత్తితో తానే పొడిపించుకున్న శైలేంద్ర.. అనుపమకి వచ్చిన డౌట్..!

December 5, 2023 9:42 AM

Guppedantha Manasu December 5th Episode : అనుపమ మహేంద్ర కి ఫోన్ చేసి, హాస్పిటల్ లో ఉన్నారట ఏమైంది అని అడుగుతుంది అనుపమ, హాస్పిటల్ లో ఉన్నామని తెలుసుకున్న నువ్వు, ఎందుకు ఉన్నామో తెలియదా అని మహేంద్ర అంటాడు. తెలిస్తే ఎందుకు అడుగుతానని అనుపమ అంటుంది. శైలేంద్ర మీద ఎటాక్ జరిగిందని, మహేంద్ర అంటాడు. జరిగిందంట అంటే ఏంటి అని అనుపమ అడుగుతుంది. అటాక్ జరిగినప్పుడు అక్కడ నేను లేను. తొందర పడి ఏది కూడా నమ్మను. అటాక్ టైం లో ధరణి ఉంది. ఆ కేస్ ని ముకుల్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఇంక నన్ను ఏమీ అడగకు అని ఫోన్ కట్ చేస్తాడు. ముక్కల్ ని అడిగితే అసలు విషయం తెలుస్తుందని అనుపమ అనుకుంటుంది.

శైలేంద్ర పడుకున్నది దేవయాని వెళ్ళిపోతుంటే, శైలేంద్ర ఆపుతాడు. పడుకున్నావని అనుకున్నాను అని దేవయాని అంటే, ఇది నాటకం. నాకు ఏం కాదు అని శైలేంద్ర అంటాడు. ఇప్పటిదాకా రిషి నీ దగ్గర కి రాలేదు నీ వాయిస్ విని షాక్ అయిపోయాడు పనిమీద బయటకు వెళ్ళాడట. అదే భయంగా ఉంది. ఇక మన రోజులు దగ్గర పడ్డాయేమో అని భయం వేస్తోందని అంటుంది. దొరికిపోతామేమో అని దేవయాని భయపడుతుంది. మన రోజులు కాదు అని ఉండదు మమ్మీ. ఏ రోజు అయినా మనకి అనుకూలంగా మార్చుకుంటామని శైలేంద్ర అంటాడు.

కంగారులో నువ్వు ఏవేవో మాట్లాడకు. వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది కేవలం నాకోసం ఏడవడం మాత్రమే. రిషి వాళ్ళు ఏం చేసినా, నేను దొరకను. ఎప్పటికైనా ఎండి సీట్ నాదే. నేనే కూర్చుంటాను అని శైలేంద్ర అంటాడు. అసలు నీపై ఎవరు ఎటాక్ చేశారు…? వాడు దొరికితే నామరూపం లేకుండా చేస్తాను అని దేవయాని అంటుంది. కాబట్టి నీకు బాగా తెలుసు. వాడి పేరు శైలేంద్ర. తల్లి పేరు దేవయాని అని జరిగింది చెప్తాడు శైలేంద్ర. వాయిస్ అందరూ వినడంతో రౌడీలకి కాల్ చేసి చెప్పినట్లు చేయమని అంటాడు. ధరణితో ప్రేమగా మాట్లాడుతున్న టైం లో రౌడీలు వచ్చి శైలేన్ద్రని కత్తితో పొడుస్తారు. ధరణి షాక్ అవుతుంది.

Guppedantha Manasu December 5th Episode today
Guppedantha Manasu December 5th Episode

నీపై నువ్వే రౌడీలతో పొడిపించుకున్నావా..? అన్ని ప్లాన్ చేశాను. అంతా ధరణి కళ్ళముందే జరిగిందని శైలేంద్ర అంటే అవును అత్తయ్య గారు అని ధరణి అంటుంది. ధరణి సారీ ఇవన్నీ ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతుంది. ధరణి రెస్ట్ తీసుకో అంటే, లేదు ఆయన దగ్గరే ఉంటానని అంటుంది. ఉండని అని శైలేంద్ర అంటాడు. ముక్కల్ ని అనుపమ కలుస్తుంది. శైలేంద్ర పై ఎవరు అటాక్ చేసారో చెప్పమని అనుపమ అడుగుతుంది. ఇలాంటి కేసులో ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు వివరాలు చెప్పము అని ముకుల్ అంటాడు.

మహేంద్ర, రిషి నాకు బాగా కావాల్సిన వాళ్ళు. నాకు చెప్పడంలో సమస్య లేదు అని అంటుంది. దాంతో మహేంద్ర కి కాల్ చేసి, అనుపమ అనే జర్నలిస్ట్ శైలేంద్ర కేసు విషయాలు అడుగుతోంది చెప్పమంటారా అని ముకుల్ అడుగుతాడు. ఆమె మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. ఫ్యామిలీ మెంబర్ లాగ. కానీ చెప్పొద్దు అంటాడు. ఇంకొకసారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకండి అని మహేంద్ర అంటాడు. అనుపమ షాక్ అవుతుంది. ఏంటి మహేంద్ర ఇలా అంటావ్ అని అంటుంది. ఇంతలో మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మీరు చెప్పకండి. నేను తెలుసుకుంటానని అనుపమ అరకులో రిషి పై జరిగిన అటాక్ ని తలుచుకుంటుంది.

ఈ రెండిటికీ కారణం ఒకరేనా..? వేరువేరు వ్యక్తులా అని ఆలోచిస్తుంది. నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అయితే నువ్ కూడా ప్రమాదంలో పడతావని మహేంద్ర అనుకుంటాడు. జగతి భార్య మాత్రమే కాదు. ఫ్రెండ్ కూడా. ఇంకొక ఫ్రెండ్ ని కోల్పోవాలని లేదు అని మహేంద్ర అనుకుంటాడు. ఇందులో ఫణింద్ర జ్యూస్ ఇస్తాడు. వెళ్లి రెస్ట్ తీసుకోమని మహేంద్ర తో అంటాడు. లేదు అన్నయ్య పక్కన బెడ్స్ ఉన్నాయి అక్కడ పడుకుంటానని మహేంద్ర చెప్తాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now