Guppedantha Manasu December 30th Episode : రిషి కల.. భద్ర ప్లాన్ ఫెయిల్.. శైలేంద్ర సీరియస్..!

December 30, 2023 10:06 AM

Guppedantha Manasu December 30th Episode : రిషి రాకపోతే, వసుధార ని చంపేస్తామని బెదిరిస్తారు. రిషి బయటికి రావాలని రౌడీ గట్టిగా అరుస్తాడు. అయితే, ఇదంతా రిషి కల. ఆ పక్కనే ఉన్న వృద్ధ దంపతులు, నీ వాళ్ళు గుర్తొచ్చారా..? అక్కడికి వెళ్లాలని ఉందా..? కొన్ని రోజులు ఓపిక పట్టమని చెప్తారు. లేదు నేను ఇప్పుడే వెళ్లాలి అంటాడు రిషి. నిన్ను వెతుక్కుంటూ రౌడీలు కూడా వచ్చారు. జాగ్రత్తగా ఉండు బిడ్డ అని చెప్తారు. రిషి కామ్ గా ఉండిపోతాడు. మరోవైపు, భద్ర మత్తుమందు ఇచ్చి, ఎవరిని భుజం మీద మోసుకెళ్తాడు. ఇంతలో ఇంట్లోంచి వసుధార వాయిస్ వినిపించడంతో కంగారుగా ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటుంది.

వసుధార వాయిస్ లోపల నుండి విన్న భద్ర వసుధార వాయిస్ విని, నేను ఎవరిని తీసుకొచ్చాను అనుకుంటాడు. అనుపమను చూసి షాక్ అవుతాడు. మహేంద్ర వసుధార మాటలు వినిపించి భద్ర ఇంటి బయట అనుపమని పడుకోబెట్టేసి, ఎవర్రా మీరు అంటూ డ్రామా ని స్టార్ట్ చేస్తాడు. నేను నిద్రలో ఉండగా గేటు చప్పుడు అయింది. ఎవరో మేడంని ఎత్తుకు పోతున్నారు. పరుగున వచ్చాను. మేడం గారిని లాగేసాను. వాడిని పట్టుకుందామని వాడి వెంట వెళ్లాను కాని దొరకలేదు అని భద్ర చెప్తాడు. ఇంట్లో కరెంటు కూడా లేదు నేను వాడి మొహం కూడా చూడలేదు అంటాడు.

అందరికీ కరెంట్ ఉంది కదా అని మహేంద్ర అంటాడు. ఇది కచ్చితంగా వాడి ప్లాన్ అయ్యి ఉంటుంది అని అంటాడు భద్ర. మహేంద్ర, వసుధార అనుపమ ని లోపలికి తీసుకెళ్తారు. మొహం మీద నీళ్లు కొట్టడంతో అనుపమలేస్తుంది. వాడెవడో పట్టుకుందామని ట్రై చేసినా మిస్ అయ్యాడని భద్ర అంటాడు. వాడు వచ్చింది నా కోసం కాదు. వసుధార కోసమని క్లారిటీ ఇస్తుంది అనుపమ. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియని శత్రువులు చాలా మంది ఉన్నారని భద్ర అంటాడు. నీకు ఎవరిపై అయినా అనుమానం వస్తే చెప్పు సైలెంట్ గా ఉండొద్దు. మేడంకి ఆపద పొంచి ఉంది. నువ్వే ఆపద నుండి బయట పడేయాలని మహేంద్ర అంటాడు.

Guppedantha Manasu December 30th Episode today
Guppedantha Manasu December 30th Episode

వీలైనంత తొందరగానే నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను అనుకుంటాడు భద్ర. వీడు ఏవేవో చెప్తాడు కానీ చేస్తాడో లేదో అని శైలేంద్ర అనుమాన పడతాడు. అసలు పని అయిందో లేదో అని టెన్షన్ పెరిగిపోతుంది. ఇంతలో కాల్ వస్తుంది. ఫోన్ తీసుకుని శైలేంద్ర లేస్తాడు. ధరణి నిద్ర లేస్తుంది. కానీ, నిద్రపోయినట్లు నటిస్తుంది. ఇంకా పని అవలేదని భద్ర చెప్తాడు. పెద్ద పొరపాటు జరిగిందని, వసుధార కి బదులు అనుపమని తీసుకెళ్లిన విషయాన్ని చెప్తాడు.

శైలేంద్ర భద్ర పై మండిపడతాడు. నువ్వు చేయాల్సిన పని తొందరగా చేయమని, శైలేంద్ర అంటాడు. ఈ మనిషి ప్రవర్తనే బాలేదు. అయినా నాకు బేరం ముఖ్యం అనుకుంటాడు భద్ర. ధరణి నిద్ర పోయిందా లేదా అని చెక్ చేస్తాడు. నిద్రపోయినట్లు ధరణి నటిస్తుంది. హమ్మయ్య అనుకుంటాడు. అక్కడ రిషి ట్రీట్మెంట్ జరుగుతుంది. మా శరీరం సహకరించట్లేదు. నిన్ను, డాడీని ఎప్పుడు చూస్తానని అనిపిస్తుంది.

నేను ఎంతో కాలం ఇక్కడే పడి ఉండలేను వస్తున్నా వసుధార అని లేవడానికి ట్రై చేస్తాడు. కానీ, లేవలేక పోతాడు. ఫోన్ కావాలని అడుగుతాడు. నెంబర్ చెప్పు నేను వెళ్లి మాట్లాడి వస్తానని వృద్ధుడు అంటే, నువ్వు వెళ్లి ఫోన్ తీసుకురా అని మరొకరు చెప్తారు. బిడ్డని జాగ్రత్తగా చూసుకో, ఫోన్ తీసుకొస్తానని వెళ్తాడు. నీ భార్య కోసం, ఎంత తపన పడుతున్నావో ఆమె చాలా అదృష్టవంతురాలని పొగుడుతుంది వృద్ధురాలు. కానీ, తను రావడం నాకు అదృష్టం అని అంటాడు రిషి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now