Guppedantha Manasu December 29th Episode : రౌడీల‌కు దొర‌క్కుండా రిషి.. వ‌సుధార‌ని కిడ్నాప్..!

December 29, 2023 11:47 AM

Guppedantha Manasu December 29th Episode : శైలేంద్ర నిజ స్వరూపం గురించి ఫణింద్ర కి తెలిసిపోవడంతో, వసుధార కంగారుపడుతుంది. ఎలా అని భయపడిపోతుంది. వసుధార ని వెతుక్కుంటూ, కాలేజికి వచ్చిన ఫణింద్ర మహేంద్ర, రిషి ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమని చెప్తాడు. వాళ్ళపై ఎంత నమ్మకం ఉందో, నీ మీద కూడా అంతే నమ్మకం ఉందని చెప్తాడు. ఫణీంద్ర మీరందరూ తొందరపడి ఏ పని కూడా చేయరు. ఎవరిని ఏమీ అనరు. ఏది చేసినా దాని వెనుక ఏదో కారణం ఉంటుందని ఫణింద్ర అంటాడు. జగతి విషయంలో రిషి విషయంలో మీరంతా శైలేంద్ర ని అనుమానించడం వెనుక కారణం ఏంటో ఎవరు అడిగిన చెప్పట్లేదు ఎందుకని నిలదీస్తాడు ఫణింద్ర.

నిజంగానే తప్పు చేసాడని తెలిస్తే, వదిలిపెట్టనని కోపంగా చెప్తాడు. శైలేంద్ర ఎండి సీట్ గురించి, నువ్వు ఫోన్ లో మాట్లాడవు. కానీ, శైలేంద్ర ని అడిగితే ఆశ లేదని లెటర్ పై రాసి ఇచ్చాడు అని పేపర్ ని చూపిస్తాడు. నీకు శైలేంద్ర ఏ విధంగా అడ్డురాడని ధైర్యంగా ఉండమని, ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నాను అని మాట ఇస్తాడు. పెద్ద మావయ్య మాటలతో వసుధార ఎమోషనల్ అయిపోతుంది. రిషి గురించి ఆలోచిస్తూ బాధలో మునిగిపోతుంది. డెడ్ బాడీ రిషిదేమోనని భయపడిపోయానని, ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయిందని అనుపమతో మహేంద్ర చెప్తాడు.

రిషి కచ్చితంగా వస్తాడని మహేంద్రని ఓదారుస్తుంది అనుపమ. అప్పుడే వీళ్ళ దగ్గరికి వసుధార వస్తుంది ఫణింద్ర ఇచ్చిన లెటర్ ని మహేంద్ర కి చూపిస్తుంది. శైలేంద్ర ఎండి సీట్ కోసం ఆశ పడుతున్న సంగతి, ఫణింద్రకు ఎలా తెలిసిందని మహేంద్ర షాక్ అవుతాడు తన వలన శైలేంద్ర నిజస్వరూపం పని అందరికీ తెలిసిందని వసుధార అసలు నిజం చెప్తుంది. ఎండి సీట్ కావాలా..? రిషి కావాలా అని కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చిందని శైలేంద్ర ఏ అనుకుని, అతనికి ఫోన్ చేసి, వార్నింగ్ ఇవ్వాలని అనుకున్నాను అని వసుధార చెప్తుంది.

Guppedantha Manasu December 29th Episode today
Guppedantha Manasu December 29th Episode

ఆ ఫోన్ ఫణింద్ర లిఫ్ట్ చేస్తే తన మాటలు మొత్తం విన్నాడని ఎండి సీట్ మీద ఆశ లేదని లెటర్ తీసుకొచ్చాడు అని చెప్తుంది. శైలేంద్ర మళ్ళీ కొత్త ప్లాన్ వేసాడేమోనని మహేంద్ర భయపడతాడు. రిషి ని కాపాడుకోవడం మనకి ముఖ్యమని చెప్తాడు. శైలేంద్ర వేసే ప్రతి అడుగుని జాగ్రత్తగా గమనిద్దాం. ఏదో ఒకచోట తప్పు చేసి దొరికిపోతాడు. ఆ ఆధారంగానే రిషి ఎక్కడున్నాడో కనిపెడదామని మహేంద్ర వసుధారతో అనుపమ అంటుంది. రిషి వస్తేనే శైలేంద్ర కి తగిన బుద్ధి చెప్దామని మహేంద్ర ఫిక్స్ అయిపోతాడు. గాయాల నుండి కోల్కొన్న రిషి కళ్ళు తెరిస్తాడు. ఒళ్లంతా దెబ్బలతో చెట్ల పొదల్లో పడి ఉన్న నిన్ను మేము ఇంటికి తీసుకు వచ్చాము అనే వృద్ధ దంపతులు చెప్తారు.

నా దగ్గరికి మిమ్మల్ని ఆ దేవుడే పంపించాడు మీరే నాకు జన్మని ఇచ్చారు. నాకు ప్రాణాలు పోశారు అని రిషి వారికి చేతులు జోడించి దండం పెడతాడు. మనం మళ్ళీ కలుస్తాం వసుధార అని రుషి మనసులో గట్టిగా అనుకుంటాడు. రౌడీలని పట్టుకుని తనకోసం ఎందుకు వెతుకుతున్నారో తెలుసుకోవాలని రిషి అనుకుంటాడు. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడితేనే రేపు వారిపై గెలవగలవాని పెద్దాయన సలహా ఇస్తాడు. రౌడీల కి కనపడకుండా రిషి ని ఇంట్లోనే దాచిపెడతాడు. వాళ్ళిద్దరూ తప్ప ఇంట్లో ఎవరు లేరని, పెద్దాయన ఎంత చెప్పినా వినకుండా రిషి ని వెతుక్కుంటూ ఇంట్లోకి రౌడీలు వస్తారు. ఇల్లు మొత్తం వెతుకుతారు.

రిషిని దాచిపెట్టిన రూమ్ లోకి రౌడీలు వస్తారు. కానీ అతనికి ఫోన్ వస్తుంది దాంతో రూమ్ చూడకుండా వెళ్ళిపోవడంతో రిషి రిలీఫ్ అవుతాడు. వసుధార ని చంపడానికి భద్ర స్కెచ్ వేస్తాడు. అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా వసుధారని చంపాలని ఫిక్స్ అవుతాడు. వసుధార రూమ్ లోకి వస్తాడు. తనని తీసుకొని వృద్ధ దంపతులు ఇంటికి రౌడీలు వస్తారు రిషి నువ్వు లోపల దాక్కున్నావ్ అని తెలుసు. మర్యాదగా లొంగిపో లేకపోతే వసుధార ప్రాణం తీస్తామని బెదిరిస్తారు. వసుధార మెడ మీద కత్తి పెడతారు. వసుధార ప్రాణాన్ని కాపాడడానికి అయినా తాను రౌడీలతో పోరాడాలని రిషి ఫిక్స్ అవుతాడు. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now