Guppedantha Manasu December 28th Episode : ఫణీంద్రకు నిజం చెప్పేసిన వసుధార‌.. ఎండీ సీటు వద్దని శైలేంద్ర రాసి ఇచ్చేశాడు..!

December 28, 2023 11:03 AM

Guppedantha Manasu December 28th Episode : మహేంద్రతో భద్ర ఎక్కడ ఉండాలన్న దాని గురించి అనుపమ అడుగుతుంది. ఇప్పుడు వేరే చోట ఉంటాడు. రేపు వచ్చాక, ఇక్కడ ఏదో ఒక రూమ్ లో ఉంటాడు అని మహేంద్ర చెప్తాడు. వద్దు ఇప్పుడే ఇక్కడే ఉండమని అనుపమ అంటుంది. ఇక్కడ సోఫాలో లేదా కారులో అయినా పడుకుంటానని భద్ర వచ్చి చెప్తాడు. రోజంతా డ్రైవ్ చేస్తున్నావ్, పడుకోవడం ప్రశాంతంగా లేకపోతే ఎలా అంటాడు. మహేంద్ర ఫుట్పాత్ మీద పడుకునే వాడిని, ఎక్కడైనా ఓకే అని భద్ర చెప్తాడు. మరోవైపు ఏంటి నాన్న, మరొక రౌడీని పెట్టావా ఎంతమందిని పెడతావ్ అంటూ దేవయాని అంటుంది.

వీడు నాసిరకం కాదు. నాణ్యత కలవాడు. నేను ఆలోచించే దాని కంటే కూడా నాలుగింతల ముందు ఉంటాడు అని చెప్తాడు. అయితే, పని కచ్చితంగా జరుగుతుంది కానీ లేట్ అవుతుందని శైలేంద్ర అంటాడు. అతను ఎవరు అని దేవయాని అడిగితే, అతన్ని సీక్రెట్ గా ఉంచుదాం అనుకుంటున్నాను అంటాడు. శైలేంద్ర నాకు ఎందుకో ధరణి చూపులు గుచ్చుకుంటున్నాయని అంటాడు. ధరణి వచ్చి, వట్టి కాఫీ కప్పులను అక్కడ పెట్టడానికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ధరణి ప్రమాదకరం అని దేవయాని అంటే, నాకు కూడా అదే అనిపిస్తుంది అని శైలేంద్ర అంటాడు. వసుధారకు రిషి కావాలా..? ఎండి సీట్ కావాలా అని మెసేజ్ వస్తుంది.

రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నీడ వెళ్లడాన్ని చూస్తుంది. అక్కడ భద్ర ఉంటాడు. ఎందుకు ఇలా వచ్చావని అడిగితే, నీళ్లు కోసం లైట్ స్విచ్ కనిపించక వచ్చాను అని భద్ర అంటాడు. వసుధారా వాటర్ ఇచ్చి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం వచ్చిన మెసేజ్ గురించి వసుధారా శైలేంద్ర కి ఫోన్ చేస్తుంది. ఫోన్ ని ఫణింద్ర లిఫ్ట్ చేస్తాడు. నీ నక్క తెలివితేటలు వక్ర బుద్ధి నా దగ్గర కాదు. మెసేజ్ నువ్వే పంపావని నాకు తెలుసు. నువ్వు భయపెడితే భయపడే రకాన్ని కాదు అని చెప్తుంది. కాలేజీ నీలాంటి వాడి చేతిలో పెడితే స్టూడెంట్స్ భవిష్యత్తు నాశనం చేసినట్లే అని అంటుంది. అమ్మ వసుధారా అని ఫణీంద్ర అనడంతో షాక్ అవుతుంది. కంగారుపడుతుంది. శైలేంద్ర ఉండు నీ పని చెప్తాను అని గట్టిగా ఫణింద్ర అరుస్తాడు.

Guppedantha Manasu December 28th Episode today
Guppedantha Manasu December 28th Episode

నువ్వు రోజు కాలేజీకి ఎందుకు వస్తున్నావ్ అని అడుగుతాడు. అడ్మిషన్ పనుల కోసం అని అంటాడు. ఇందాకా నీకు వచ్చిన కాల్ నేను మాట్లాడను. నీకు ఎండి సీట్ మీద ఆశ ఉందని ఫణింద్ర అనడంతో, దేవయాని శైలేంద్ర షాక్ అయిపోతారు. కోరుకున్నట్లు ఉన్నారు మావయ్య ఓసారి అన్నట్లు అనిపించింది అని ధరణి అంటుంది. నేను ఎప్పుడు అన్నానని శైలేంద్ర అంటే తన సంగతి వదిలే నువ్వు చెప్పు అని గట్టిగా నిలదీస్తాడు ఫణింద్ర.

రాలేదు డాడ్ నాకు ఎలాంటి ఆశ లేదని శైలేంద్ర చెప్తాడు. నీకు ఎటువంటి ఆశ లేదని రాతపూర్వకంగా రాసి ఇవ్వమంటాడు. దాంతో శైలేంద్ర షాక్ అవుతారు. రాతపూర్వకంగా ఉంటే ఎవరు మార్చలేరు అని ఫణింద్ర అంటే, సరే డాడ్ అని ఎండి సీటు వద్దని పేపర్ పై రాసి ఇస్తాడు. శైలేంద్ర వెరీ గుడ్ రా అంటాడు. ఫోన్ మాట్లాడింది ఆలోచిస్తుంటే ఫణింద్ర వస్తాడు లోపలికి రండి సార్ అని పిలిచి వసుధర ఇబ్బంది పడుతుంది. తాను ఇబ్బంది పడడాన్ని గమనిస్తాడు ఫణింద్ర. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now