Guppedantha Manasu December 26th Episode : రిషి కోసం క‌న్నీళ్లు పెట్టుకున్న వసుధార.. రిషిని చంపడానికి భ‌ద్ర డీల్.. ప్లాన్ వేసిన శైలేంద్ర..!

December 26, 2023 10:50 AM

Guppedantha Manasu December 26th Episode : రిషి రౌడీల నుండి తప్పించుకోవడంతో, వసుధారని చంపాలని స్కెచ్ వేస్తాడు శైలేంద్ర. కానీ, భద్ర అనే ఒక అతను వచ్చి వసుధార, అనుపమలని కాపాడతాడు. ఒక డెడ్ బాడీ దగ్గర రిషి ఫోన్ పోలీసులకి దొరుకుతుంది. అది రిషి బాడీ నా కాదా ఐడెంటిఫై చేయాలని పిలుస్తారు. గాయాలతో ఉన్న రిషికి, అటవీ ప్రాంతంలో చెట్ల మందులతో ఇద్దరు వ్యక్తులు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన రిషి వసుధారా అని పిలుస్తాడు. ఆమె పేరుని పదేపదే కలవరిస్తూ ఉంటాడు. వసుధార అంటే ప్రేమించిన అమ్మాయి అయినా అయ్యుండాలి. లేకపోతే, భార్య అయినా అయ్యి ఉండాలని రిషి కి ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది.

రిషి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. రిషి ఫోన్ చనిపోయిన వ్యక్తి దగ్గర ఎందుకు ఉందో తెలియదు. ముకుల్ కి కూడా అదే విషయాన్ని చెప్తాడు. ఆ చనిపోయిన వ్యక్తి ఫోటోని సీక్రెట్ గా తీసి, ముకుల్ కి పంపిస్తాడు. అతని గురించి తాను ఇన్వెస్టిగేషన్ చేస్తానని మహేంద్ర కి మాట ఇస్తాడు. రెండు రోజుల్లో రిషిని తనకి క్షేమంగా అప్పగించాలని వసుధారా ఇచ్చిన వార్నింగ్ గురించి, శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. రిషి ని తానే కిడ్నాప్ చేసినట్లు వసుధార వద్ద ఉన్న వీడియో సాక్షాన్ని ఆమె చూపిస్తుందేమోనని కంగారు పడుతూ ఉంటాడు.

అతడి దగ్గరికి ఫణింద్ర వస్తాడు. కాలేజీ ఎండి సీట్ నీకు దక్కడం కంటే ముందు, రిషి ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోవడం ముఖ్యమని శైలేంద్ర కి ఫణింద్ర చెప్తాడు. రిషి విషయంలో. మహేంద్ర పడుతున్న బాధని నువ్వే తీర్చాలని అంటాడు. నీపై మహేంద్ర వసుధారాలకు ఉన్న అనుమానాలు తొలగాలంటే, రిషి ఎక్కడున్నాడో నువ్వే తెలుసుకుని వాళ్ళకి అప్పగించమని ఫణింద్ర కొడుకుకు చెప్తాడు.

Guppedantha Manasu December 26th Episode today
Guppedantha Manasu December 26th Episode

తనకు రిషి ఎక్కడున్నాడో తెలియదని అబద్ధం చెప్తాడు. రిషి అడ్రస్ తెలుసుకోవాలి. నీ బాధ్యత అని కొడుకుకి గట్టిగా ఫణింద్ర చెప్తాడు. నిన్ను అనుమానించడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు నిజాయితీ నిరూపణ కావాలంటే రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. ఇప్పటినుండి రిషి ని వెతకమని చెప్తాడు. తండ్రి ముందు కూడా శైలేంద్ర ఇరుక్కుపోతాడు. రిషి ని తలుచుకుని, వసుధార మహేంద్ర ఎమోషనల్ అయిపోతారు.

మార్చురీ లో రిషి డెడ్ బాడీ ఎక్కడ కనిపిస్తుందో అని, కంగారు పడిన విషయం గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారు. రిషి దూరమైతే ఊపిరి ఆగిపోయేదని వసుధార తల్లడిల్లి పోతుంది. జగతి ఫోటోకి తన మనసులోని బాధని మొత్తం మహేంద్ర చెప్పుకుంటాడు. అసలు రిషి ఎక్కడున్నాడు, ఎందుకు తిరిగి రావడం లేదని బాధపడతాడు. రిషి ని కాపడతావని ధైర్యం నాకు ఉందని జగతి ఫోటోతో మహేంద్ర చెప్తాడు. వసుధారని చంపమని తను డీల్ కుదుర్చుకున్న వ్యక్తి కోసం, శైలేంద్ర చూస్తాడు. అప్పటికే అక్కడికి వసుధారాని కాపాడిన భద్ర వస్తాడు.

తానే ఆ కిల్లర్ అని చెప్తాడు భద్ర. వసుధారని చంపకుండా ఎందుకు వదిలేసావు అని శైలేంద్ర అంటాడు. నాతో పాటు బేరం కుదుర్చుకున్న వాళ్ళు పోలీసులకి దొరక్కుండా మర్డర్ చేయడమే తన స్టైల్ అని శైలేంద్ర కి చెప్తాడు ప్లాన్ ప్రకారం వసుధారకి దగ్గర అయినట్లు చెప్తాడు. తను ఇప్పుడు చేయబోయేది 101 హత్య అని చెప్తాడు. వసుధారా అడ్డు తొలగించమని, భద్రా ని రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర. తర్వాత వసుధారతో కలిసి తను ఆసుపత్రికి వెళ్లిన విషయం చెప్తాడు.

దొరికిన డెడ్ బాడీ ఫోటో ని శైలేంద్ర కి చూపిస్తాడు భద్ర. అక్కడ ఉన్నది రిషి ని కిడ్నాప్ చేయమని తను డీల్ కుదుర్చుకున్న రౌడీ ఫోటో. దీంతో శైలేందర్ లో టెన్షన్ పెరిగిపోతుంది రౌడీ చనిపోయాడు అంటే రిషి తప్పకుండా బతికే ఉంటాడని అనుకుంటాడు. రిషి ని చంపమని భద్ర కి చెప్తాడు. శైలేంద్ర అతని ఫోటో కూడా చూపిస్తాడు. తన కాలర్ పట్టుకున్నందుకు శైలేంద్ర కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్తాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now