Guppedantha Manasu December 25th Episode : శైలేంద్ర‌కు వార్నింగ్ ఇచ్చిన వ‌సుధార.. సురక్షితంగా ఉన్న రిషి..!

December 25, 2023 10:10 AM

Guppedantha Manasu December 25th Episode : రిషి రౌడీల నుండి తప్పించుకోవడంతో, శైలేంద్ర టెన్షన్ పడిపోతాడు. రిషిని తనను కిడ్నాప్ చేసినట్లు వసుధారా దగ్గరికి పక్కా ఆధారం ఉండడంతో, చంపడానికి రౌడీలతో స్కెచ్ వేస్తాడు. కానీ తన ప్లాన్ రివర్స్ అవుతుంది. కొత్త క్యారెక్టర్ వచ్చి వసుధార, అనుపమని సేవ్ చేస్తాడు. రౌడీలని చితకబాడుతాడు. అతని దెబ్బలు కి తట్టుకోలేక, రౌడీలు పారిపోతారు. ప్రాణాలని కాపాడిన వ్యక్తికి వసుధార అనుపమ థాంక్స్ చెప్తారు. అతను వారిని వంద రూపాయలు అడుగుతారు. కానీ, అనుపమ 500 ఇస్తుంది. తనకి 500 వద్దు. వంద రూపాయలు మాత్రమే కావాలని తీసుకుంటాడు.

వసుధారా కార్ టైర్ పంచ్ అవ్వడం తో, అతనే కారుని బాగు చేస్తాడు. శైలేంద్ర అటాక్ చేయించాడని, వసుధారా అనుపమ డౌట్ పడతారు. శైలేంద్ర కి ఫోన్ చేస్తుంది. ఈ పాటికి వసుధార చనిపోయి ఉంటుందని శైలేంద్ర అనుకుంటాడు. కానీ, ఫోన్ రావడంతో కంగారు పడిపోతాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఈపాటికి చనిపోయి ఉండాల్సింది. ఎలా మాట్లాడుతున్నావ్ అని అనుకుంటున్నావా అని ఫోన్ లిఫ్ట్ చేయడంతో, శైలేంద్ర మీద సెటైర్ వేస్తుంది వసుధార.

మా పై నువ్వే అటాక్ చేసావ్ అని నాకు తెలుసు అని శైలేంద్ర మీద సీరియస్ అవుతుంది. తనకి ఎటువంటి సంబంధం లేదని, శైలేంద్ర డ్రామా ఆడుతాడు. నీ ఓవరాక్షన్ నా దగ్గర చూపించకు అని శైలేంద్ర కి వార్నింగ్ ఇస్తుంది. వసుధార మాపై నువ్వే అటాక్ చేసావ్ అని తెలుసు అంటూ సీరియస్ అవుతుంది. ఎటువంటి సంబంధం లేదని శైలేంద్ర అంటాడు. ఓవరాక్షన్ నా దగ్గర చూపించుకుని అంటుంది. ఇప్పటిదాకా పక్కా ఆధార్ లేవు కనుక సైలెంట్ గా ఉన్నాం. నువ్వు రిషిని కిడ్నాప్ చేసిన వీడియో, నా దగ్గర ఉంది అదే ముకుల్ కి పంపిస్తే, జైలుకు వెళ్తావు అని శైలేంద్ర ని బెదిరిస్తుంది.

Guppedantha Manasu December 25th Episode today
Guppedantha Manasu December 25th Episode

రెండు రోజులులో రిషి ని తీసుకు రాకపోతే, ముకుల్ కి వీడియోని పంపిస్తానని చెప్తుంది. ఈసారి అలా వదిలేయమని హెచ్చరిస్తుంది. వసుధార వార్నింగ్ తో శైలేంద్ర భయపడతాడు. వసుధార ని కాపాడింది ఎవరని ఆలోచిస్తాడు. తన ఫోన్ టాప్ లో ఉండడంతో, రౌడీలకే ఫోన్ చేయలేక పోతాడు. రిషి నుండి వసుధార కి ఫోన్ వస్తుంది. ఫోన్ రిషి ఏ చేశాడు అనుకోని వసుధార ఎమోషనల్ అయిపోతుంది. రిషి కాకుండా మరో గొంతు వినపడుతుంది. తమ హాస్పిటల్ లో జాయిన్ అయిన వ్యక్తి దగ్గర ఈ ఫోన్ ఉందని చిన్న ఐడెంటిఫికేషన్ కోసం, హాస్పిటల్ కి రావాలని చెప్తారు. వసుధార కంగారు పడుతుంది.

విషయాన్ని మహేంద్ర కి కూడా చెప్తుంది. అనుపమ, వసుధార, మహేంద్ర హాస్పిటల్ కి వెళ్తారు. రౌడీల భారీ నుండి వసుధారని సేవ్ చేసిన వ్యక్తి కూడా హాస్పిటల్ కి వస్తాడు. ఎవరి ఫోన్ అంటే రిషి ఫోన్ అని చెప్తుంది. ఈ ఫోన్ మాకు డెడ్ బాడీ దగ్గర దొరికిందని పోలీసులు చెప్తారు. వారి మాటలు వసుధార మహేంద్రని షాక్ అయ్యేలా చేస్తాయి. డెడ్ బాడీని చూసిన అనుపమ రిషి కాదని చెప్తుంది.

వసుధార, మహేంద్ర రిలీఫ్ అవుతారు. అప్పుడే మార్చురీ లో పనిచేసే వ్యక్తి డెడ్ బాడీ మారిపోయిందని చెప్పేస్తాడు. అక్కడ ఈ ఫోన్ దొరికింది అని అంటాడు. ఆ డెడ్ బాడీ కూడా రిషి ది కాదు. వసుధారతో పాటు వచ్చిన కొత్త వ్యక్తితో పాటు మహేంద్ర పోలీసులు చూడకుండా సీక్రెట్ గా, డెడ్ బాడీ ఫోటో తీస్తాడు. తీవ్ర గాయాలు పాలైన రిషి కి ఒక అటవీ ప్రాంతంలో చెట్టు మందులతో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన రిషి వసుధారా అని గట్టిగా పిలుస్తాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now