Guppedantha Manasu December 23rd Episode : తప్పించుకున్న రిషి.. వసుధార పై అటాక్..!

December 23, 2023 9:59 AM

Guppedantha Manasu December 23rd Episode : ఇప్పుడు మనం ఏ తప్పు చేసినా తప్పించుకుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, వసుధార అంటుంది. కరెక్టే ఈ విషయం ముకల్ కి చెప్తామని కాల్ చేస్తుంది. అనుపమ జరిగిందంతా చెప్తుంది. ఇప్పుడు రిషి గురించి, ఎవరో ఒకరు కి శైలేంద్ర కి కాల్ చేస్తాడు అని అనుపమంటుంది. నేను ఇదివరకే శైలేంద్ర ఫోన్ ని గమనించేలా పెట్టాను. నేను చూసుకుంటానని ముకుల్ అంటాడు. శైలేంద్ర ఒక ఫోన్ కాల్ చెయ్యి దొరికిపోతావని ముకుల్ అనుకుంటాడు. మరో వైపు రౌడీలు కి కాల్ చేసి, వాడిని చంపొద్దు. తిండి నీళ్లు ఇవ్వండి అని శైలేంద్ర చెప్తాడు. సార్ పంజరంలో చిలుక ఎగిరిపోయింది అని టెన్షన్ గా చెప్తాడు. వాడు ఎలా తప్పించుకుంటాడు రా దున్నపోతుల్లా ఉన్నారు.

ఎలా జరిగిందని శైలేంద్ర వాళ్ల మీద ఫైర్ అవుతాడు. ఇంతలో ఒక అతను వస్తాడు. సార్ నా ఫోన్ అని అంటాడు. ఎవరి ఫోన్ నిండో శైలంద్ర ఫోన్ చేస్తాడు. సర్ చాలాసేపటినుండి మాట్లాడుతున్నారు. ఇంకా మాట్లాడితే డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఇస్తాను అని డబ్బులు ఇస్తాడు. వాడి గురించి వెతకండి, ఏదైనా అప్డేట్ చేయండి. కానీ, నాకు కాల్ చేయొద్దు నా ఫోన్ టాప్ లో ఉందని అంటాడు. నేను ఏదో ఒకరి ఫోన్ నుండి కాల్ చేస్తాను అని ఫోన్ కట్ చేసేస్తాడు. రిషి ని అడ్డుపెట్టుకొని, ఆడుకుందామని అనుకుంటే ఇలా జరిగింది. ఇదంతా నా పీక కి చుట్టుకునేలా ఉందని శైలేంద్ర అనుకుంటాడు.

వసుధారా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మిస్ అవుతున్నాను. ఐ లవ్ యు సార్ త్వరలోనే నా దగ్గరికి వస్తారని అనిపిస్తోందని వసుధారా అనుకుంటుంది. శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ధరణి వచ్చి టవల్ ఇస్తుంది. చెంప బాగా వాచిపోయింది ఎవరైనా కొట్టారా మిమ్మల్ని అని అంటుంది. ఎవరు కొడతారు. వసుధారకి కూడా ధైర్యం లేదు అని ధరణి కావాలనే అంటుంది. శైలేంద్ర విసుక్కుంటాడు. శైలేంద్ర దగ్గరికి వచ్చి దేవయాని ఏమైంది చెప్పు ఎందుకు వాచింది అని అడుగుతుంది.

Guppedantha Manasu December 23rd Episode today
Guppedantha Manasu December 23rd Episode

వసుధారా కొట్టింది అని చెప్తాడు. రిషి ని ఏదో ఒకటి చెయ్యని అంటే, వాడు నా దగ్గర ఉంటే కదా..? నేనే కిడ్నాప్ చేయించాను కానీ తప్పించుకున్నాడని శైలేంద్ర అంటాడు. షాక్ అయిన దేవయని, వాడు నేరుగా ఇంటికి వస్తాడు. వస్తే అందరి పని అయిపోతుంది భయంగా ఉంది అని అంటుంది. రౌడీలను పెట్టి అయినా వాడిని చంపించు అని దేవయాని అంటుంది. వాడు చస్తే మనం చస్తాం. నా దగ్గరే వాడు ఉన్నట్టు పక్కా ఆధారం ఉందని, అంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని దేవయాని అంటే, వసుధారా ని చంపేద్దాం అదొక్కటే దారి అని అంటే, సరే అలాగే చేయు అని దేవయాని అంటుంది. మరోవైపు కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు.

అతని ఫేస్ చూపించకుండా, డీల్ వచ్చినట్లు ఒక అబ్బాయి చెప్తాడు. డబ్బులు బాగా ఇస్తారని కుర్రాడు చెప్తాడు. అనుపమ, వసుధారా, ముకుల్ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎలా అయినా శైలేంద్ర దొరుకుతాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ మీద అటాక్ చేయించిన చేయిస్తాడు అని ముకుల్ చెప్పి వెళ్తాడు. అనుపమ వెళ్తున్న కార్ని టైర్ పంచర్ అయ్యేలా చేస్తాడు. కిందకి దిగిన వసుధారా మేకులు చూస్తుంది.

కావాలని ఎవరో టైర్ పంచర్ చేశారని అనుకుంటారు. రౌడీలు వస్తారు. అనుపమ వసుధార తప్పించుకుందామని ట్రై చేస్తారు. కానీ రౌడీలు చుట్టూ వుంటారు. ఎక్కడికి పారిపోతారే అని కత్తి తీస్తాడు. వసుధారాని కత్తితో పొడవబోతుంటే ఒక వ్యక్తి వచ్చి అడ్డుకుంటాడు. అతన్ని వసుధాన ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంతకుముందు డీల్ వచ్చింది అని చెప్పింది వసుధారని కాపాడేందుకు అని తెలుస్తుంది. లేదంటే రిషి అయ్యే అవకాశం కూడా ఉంది ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now