Acharya Movie : మెగా అభిమానుల‌కు పండుగ లాంటి వార్త‌.. ఆచార్య రిలీజ్ అవుతోంది..!

December 19, 2021 4:58 PM

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ మూవీని కొరటాల శివ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

good news to mega fans Acharya Movie  is going to release

ఆచార్య సినిమాను ఫిబ్ర‌వరి 4, 2022న విడుద‌ల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ అనుకున్న తేదీ లోపు పనుల‌న్నింటినీ పూర్తి చేసి సినిమాను క‌చ్చితంగా విడుద‌ల చేయాల్సిందేన‌ని.. నిర్మాత‌లు గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఈసారి ఎలాంటి వాయిదా లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే ఈ మూవీ విడుద‌ల కావ‌ల్సి ఉన్నా.. ప‌లు కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డ‌డం చేత ఫ్యాన్స్ నిరాశ చెందుతూ వ‌చ్చారు. అయితే తాజా వార్త అభిమానుల‌కు ఎంత‌గానో ఆనందాన్ని క‌లిగిస్తోంది.

ఈ మూవీని మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌ల‌పై నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ తేజ‌లు నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ స‌మ‌ర్ప‌కురాలిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ప‌క్క‌న పూజా హెగ్డె న‌టించ‌గా, చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. దీంతో ఆచార్య‌పై అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now