Guntur Karam : గుంటూరు కారం చిత్రాన్ని రిజెక్ట్ చేసిన హీరో ఎవ‌రంటే..!

November 14, 2023 9:52 AM

Guntur Karam : సాధారణంగా హీరోలకి సరిపోయేలా దర్శకులు కథలను సిద్ధం చేస్తూ ఉంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో ఏదో కార‌ణాల వ‌ల‌న ఆ క‌థ‌ల‌ని వేరే హీరో రిజెక్ట్ చేయ‌డం, ఆ క‌థ‌తో ఇంకో హీరో సినిమా చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అలా ఎక్కువ హిట్ సినిమాలను వదులుకున్నారు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం. ఈ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో గురూజీ మొదట టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట. ఆయ‌న వివిధ కార‌ణాల వ‌ల‌న‌ ఈ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు కాగా, ఇప్పటికే వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి ఈ కాంబో రిపీట్ అవుతుంది. ఇక ఈ సినిమా మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. చిత్రంలో మ‌హేశ్ బాబు సరసన మొదట పూజా హెగ్డే అనుకున్నారు మేకర్స్. అయితే ఆమె తప్పుకోవడం.. ఈ సినిలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

do you know who rejected Guntur Karam movie
Guntur Karam

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను మొదట ఓ టాలీవుడ్ స్టార్ హీరో చేయాల్సి ఉండేనట. అయితే ఆయన రిజెక్ట్ చేయడం వల్లే ఈ సినిమా మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలి అనుకున్నారట. ఆయనకు కథ కూడా చెప్పారని తెలుస్తోంది. అయితే ఆయన రిజెక్ట్ చేయండ వల్లే మహేశ్ బాబు చేతుల్లోకి వెళ్లిందట. అయిష్టంగానే పవన్ కల్యాణ్ గుంటూరు కారం సినిమాను వదులుకున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now