Pushpa : పుష్ప మూవీలో అల్లు అర్జున్‌, ర‌ష్మిక‌, ద‌ర్శ‌కుడు సుకుమార్‌ల రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

December 19, 2021 8:19 PM

Pushpa : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం పుష్ప‌.. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లై రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. డిసెంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ అంద‌రినీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. తొలి రోజు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా.. క్ర‌మ క్ర‌మంగా ఈ మూవీకి ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయితే ఈ మూవీలో న‌టించిన వారితోపాటు ప‌నిచేసిన వారికి రెమ్యున‌రేష‌న్ ఎంత ఇచ్చార‌నే విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

do you know how much remuneration allu arjun and others got for Pushpa movie

పుష్ప మూవీ తొలి రోజు రూ.71 కోట్లు రాబ‌ట్ట‌గా, రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ మూవీ రూ.116 కోట్ల గ్రాస్‌ను వ‌సూలు చేయ‌డం విశేషం. ఇక ఆదివారం కావ‌డంతో 3వ రోజు క‌లెక్ష‌న్లు బాగానే వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక పుష్ప మూవీలో న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ విష‌యానికి వ‌స్తే.. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే ర‌ష్మిక మంద‌న్న రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్లు, విల‌న్‌గా న‌టించిన మ‌ళ‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ రూ.3.50 కోట్లు, ద‌ర్శ‌కుడు సుకుమార్ రూ.25 కోట్ల‌ను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ‌ప్ర‌సాద్ రూ.3.50 కోట్లు, ఐట‌మ్ సాంగ్‌లో న‌టించిన స‌మంత రూ.1.50 కోట్లు తీసుకున్నార‌ట‌. నెగెటివ్ రోల్‌లో న‌టించిన యాంక‌ర్ అన‌సూయ ఒక రోజు షూటింగ్‌కు రూ.1.50 ల‌క్ష‌ల నుంచి రూ.2 ల‌క్ష‌ల మేర తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now