వినోదం

Curry And Cyanide OTT : ఓటీటీలో సంద‌డి చేస్తున్న రియ‌ల్ క్రైమ్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్.. ఎందులో చూడాలి అంటే..!

Curry And Cyanide OTT : థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ఎంతో ఆస‌క్తిని చూపుతున్న విష‌యం తెలిసిందే. బడా హీరోల సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా ఓటీటీలో రిలీజై ప్రేక్షకులను ఎంతో ఆక‌ట్టుకుంటున్నాయి. తాజాగా అలాంటి చిత్రం ఒక‌టి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.ముఖ్యంగా ఎక్కువ మంది ఎంతో ఇష్టపడే అద్భుతమైన థ్రిల్లర్ సినిమాలు ఓటీటీలో తెగ సంద‌డి చేస్తుండ‌గా, తాజాగా ఓ అద్భుతమైన రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. అప్ప‌ట్ల కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని చాలా మంది సినిమాగా మలిచారు.

కేవలం సినిమాగానే కాకుండా డాక్యుమెంటరీగా, సీరియల్ గా కూడా రూపొందించడం మ‌నం చూశాం. వీటికి సంబంధించి చిత్రాలు కూడా ప్రేక్ష‌కు ముందుకు వ‌చ్చాయి. ఇప్పుడు డాక్యుమెంట‌రీ వ‌చ్చింది. అదే జూలీ జోసెఫ్ కథ. అయితే కళలోని కోజికోడ్ కూడతాయి గ్రామానికి చెందిన ఆమె 14 సంవత్సరాల్లో మొత్తం ఆరు హత్యలు చేసింది. తన కుటుంబ సభ్యులనే తాను అలా హత్య చేయడం… అప్పట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆమె ఆరు హత్యలకు ఎలా పాల్పడిందో తెలుసుకుని అంతా అవాక్కయ్యారు.అన్నింటిని ఆమె అనుమానాస్పద మృతులుగా కట్టుకథలు అల్లింది.

Curry And Cyanide OTT

జూలీ జోసెఫ్‌ తన అత్తయ్యను, మామయ్యను, ఆతర్వాత ఆమె భర్త రాయ్‌ థామస్‌, ఆతర్వాత తన అత్తయ్య సోదరుడు మాథ్యూ, తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను చంపేసింది . ఆతర్వాత షాజు జచారయ్యను రెండో వివాహం చేసుకుంది. అయితే జూలీ జోసెఫ్‌ భర్త సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరిని చంపిన జూలీ జోసెఫ్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కర్రీ అండ్‌ సైనైడ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిసెంబర్ 22వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, మిస్ అయిన వారు త‌ప్ప‌క ఈ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM