Chiranjeevi : మీడియా త‌ప్పుగా చిత్రీక‌రించి న‌న్ను బ‌ద్నామ్ చేసింది: చిరంజీవి

December 6, 2021 8:38 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దేశ వ్యాప్తంగా అశేష ప్రేక్ష‌కాదర‌ణ ద‌క్కించుకున్న చిరంజీవి వివాదాల‌కు చాలా దూరంగా ఉంటారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించి అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న‌పై మీడియాతోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఎన్ని విమ‌ర్శ‌లు చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా మీడియా అప్ప‌ట్లో ఎలా ప్ర‌వ‌ర్తించిందో తాజాగా వివ‌రించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత యాత్ర చేశానని తెలిపారు.

Chiranjeevi said at that time media insulted him

బస్సులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. ఆ సమయంలో ఫ్యాన్స్ తోపాటు ప్రజలను ఆయన కలవడం జరిగింది. చాలా మందిని ఆలింగనం చేసుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం చేశాను. ఒక స్టేషన్ లో స్పీచ్ ముగిశాక నెక్స్ట్ స్టేషన్ కి బస్సులో వెళుతున్నాను. నాలుగు మీడియా ఛానల్స్ నన్ను నిరంతరం ఫాలో అవుతున్నాయి. అది నా మీద ప్రేమతో కాదు.. ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతుందా.. హైలెట్ చేయాలనే తపనతో.

నాకు మా బాయ్ ఖర్జూరాలు తినడానికి ఇచ్చాడు. వాటిని తినడం కోసం శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకున్నాను. అది నీట్ గా వీడియో తీసి.. నేను పండ్లు తినడం కోసం చేతులు శుభ్రం చేసుకున్న వీడియో పక్కన పెట్టి.. ఫ్యాన్స్ కి షేక్ హ్యాండ్ ఇవ్వగానే చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకున్నట్లు చక్కగా ఎడిట్ చేశారు.

చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియో పదే పదే చూపిస్తూ.. చిరంజీవికి ఫ్యాన్స్ అంటే అంత అంటరాన్ని వాళ్ళు అయ్యారా ? ప్రజల్ని తాకడమంటే ఆయనకు అంత అసహ్యమా ? ఇలాంటి వ్యాఖ్యలతో నన్ను బద్నామ్ చేశారు అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు మైక్ పైన శానిటైజర్ స్ప్రే చేద్దామన్నా.. భయం వేస్తుంది అని చిరు ఓ కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now