Brahmanandam : నేటిత‌రం యువ‌త‌కు బ్ర‌హ్మానందం ఇచ్చిన మెసేజ్ ఇదే.. ఆయ‌న ఏమ‌న్నారంటే..?

January 15, 2026 9:13 PM

Brahmanandam : ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది టెక్నాల‌జీ యుగం. ఒకప్ప‌టిలా కాదు. ఇప్పుడు అంతా వేగ‌మే. ఏ రంగంలో చూసినా అన్నింటిలోనూ ప్ర‌జ‌లు వేగం కోరుకుంటున్నారు. అంతెందుకు.. మ‌న‌కు ఒక‌ప్పుడు మొబైల్ ఫోన్లే ఉండేవి కావు. కానీ ఇప్పుడు వాటిల్లో ఏకంగా 5జి ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అత్యంత వేగంగా పొందుతున్నాం. ఒక‌ప్పుడు ఇంటర్నెట్ సేవ‌ల‌ను వాడుకోవాలంటే మ‌న‌కు స‌మీపంలో ఉన్న ఇంట‌ర్నెట్ కెఫెల ద‌గ్గ‌ర‌కు ప‌రిగెత్తుకు వెళ్లాల్సి వ‌చ్చేది. కానీ ఇప్పుడ‌లా కాదు.. మీట నొక్కితే చాలు, ప్ర‌పంచం మొత్తం మ‌న గుప్పిట్లో ప్ర‌త్య‌క్షం అవుతుంది.

అయితే అన్ని రంగాల్లోనూ వేగంగా ప‌నులు జ‌రుగుతున్నాయి క‌నుక నేటి త‌రం యువ‌త కూడా తాము చేస్తున్న ప‌నుల్లో వేగాన్నే కోరుకుంటున్నారు. చేసే జాబ్ ఏదైనా లేదా వ్యాపారం అయినా స‌రే చాలా త్వ‌ర‌గా డెవ‌ల‌ప్ అవ్వాల‌ని చూస్తున్నారు. కానీ ఒక మ‌నిషి స‌క్సెస్ అవ్వాలంటే వేగం ప‌నికిరాద‌ని, కొన్ని సార్లు చాలా క‌ష్డ‌పడాల్సి ఉంటుంద‌ని సీనియ‌ర్ క‌మెడియ‌న్‌, న‌టుడు బ్ర‌హ్మానందం అన్నారు. ఈ మ‌ధ్య‌నే ఆయ‌న ఒక చోట నేటి త‌రం యువ‌త గురించి మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం యువ‌తకు తొంద‌రెక్కువ‌న్నారు. ఏది కావాల‌న్నా వెంట‌నే జ‌రిగిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని, అలాగే స‌క్సెస్ కూడా త్వ‌ర‌గా రావాల‌ని ఆశిస్తున్నార‌ని అన్నారు.

Brahmanandam given important suggestions to youth who wants success in career
Brahmanandam

అయితే స‌క్సెస్ ఎవ‌రికీ అంత ఈజీగా రాద‌ని, చాలా సార్లు ఫెయిల్ అయితేనే స‌క్సెస్‌ను అందుకోగ‌ల‌మ‌ని అన్నారు. ల‌క్ ఉన్న కేవ‌లం కొంద‌రు మాత్రమే అతి త‌క్కువ కాలంలో ఉన్న‌త స్థాయికి చేరుకుంటార‌ని, కానీ ఒక సాధార‌ణ పౌరుడికి మాత్రం కొన్ని ఏళ్లకు ఏళ్లు శ్ర‌మ అవ‌స‌రమ‌ని అన్నారు. అయితే బ్ర‌హ్మానందం చెప్పిన మాట‌ల‌ను యూత్ చెవికెక్కించుకుంటారో లేదో తెలియ‌దు కానీ.. ఆయ‌నను మాత్రం మీమ్స్ రూపంలో చాలా మంది ఉప‌యోగించుకుంటున్నారు. అందుక‌నే ఆయ‌న ఈ స‌ల‌హా ఇచ్చారు కాబోలు. మ‌రి యువ‌త పాటిస్తారో లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now