Boys Hostel OTT : ఒకప్పుడు నటిగా అలరించిన రష్మీ గౌతమ్ ఇప్పుడు యాంకరింగ్‌తో సత్తా చాటుతుంది. జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలతో పాటు ఇతర కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తూ అదరగొడుతుంది. అయితే రష్మీ అడపాదడపా వెండితెరపై కూడా సందడి చేస్తుంది. ఈ అమ్మడు ఇటీవలి కాలంలో నటించిన చిత్రం బాయ్స్ హాస్టల్. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి చిన్న సినిమాగా వచ్చి ట్రెండ్ సెట్టర్‍గా నిలిచిన హాస్టల్ హుదుగురు బేకగిద్దారే తెలుగులో బాయ్స్ హాస్టల్ పేరుతో విడుదలైంది. ఒరిజనల్ వెర్షన్‌లో రిషబ్ శెట్టి, రమ్య పోషించిన పాత్రలను తెలుగులో తరుణ్ భాస్కర్, యాంకర్ రష్మీ గౌతమ్ పోషించారు. కన్నడలో మాదిరిగానే తెలుగులోను ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది.
బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ మంచి కలెక్షన్స్‌నే రాబట్టింది. థియేటర్స్‌లో తెగ ఆకట్టుకున్న ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తుండగా, తాజాగా తెలుగు వర్షెన్ ఓటీటీలో సందడి చేస్తుంది. ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో రాగా తెలుగు వెర్షన్ మాత్రం ఈటీవీ విన్‌లో శుక్రవారం (నవంబర్ 10) నుండి స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా మొత్తం హాస్టల్‌లోని వార్డెన్ శవం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హాస్టల్‌లో ఉండే ఓ కుర్రాడు షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటాడు. ఈ మేరకు తను రాసుకున్న ఓ షార్ట్‌ఫిలిం స్టోరీని తన ఫ్రెండ్స్‌కు చెబుతుంటాడు. అయితే ఆ కుర్రాడు చెప్పిన షార్ట్‌ఫిల్మ్‌లో మాదిరిగానే నిజంగానే వారి హాస్టల్ వార్డెన్ చనిపోతాడు.
అప్పుడు అతని వద్ద ఒక సూసైడ్ లెటర్ లభ్యమవుతుంది. ఇక అందులో ఆ కుర్రాడితో పాటు స్నేహితుల పేర్లు రాసి ఉంటాయి. దాంతో వార్డెన్ శవాన్ని దాచి పెట్టేందుకు హాస్టల్ బాయ్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సమయంలో వారికి ఎదురైన అనుభవాలేంటి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు చిత్ర దర్శకుడు. ఇలాంటి క్రైమ్ చుట్టూ కామెడీని పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి వంద మార్కులు కొట్టేయడంతో సినిమాకి నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. చిత్రం మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…