Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నాగార్జున ధ‌రించిన ఈ స్వెట‌ర్ ధ‌ర ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డాల్సిందే..!

December 11, 2023 3:59 PM

Bigg Boss 7 Telugu : ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 7 అంతా ఉల్టా పుల్టాగా సాగుతుంది. నాగార్జున హోస్ట్‌గా న‌డుస్తున్న ఈ కార్య‌క్రమం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో హౌస్ మేట్స్ తో నాగార్జున ఆడుకుంటున్నారు. అసలు మాస్కులు తీస్తున్నారు. దీంతో కంటెస్టెంట్లకు ఏం మాట్లాడాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క‌రికి త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేస్తూ గాలి తీస్తున్నారు. కొద్ది స‌మ‌యాల‌లో వారి భాష‌ల‌లోనే మాట్లాడుతూ పిచ్చెక్కిస్తున్నారు. బొంగు అంటే అదో పెద్ద బూతులా చెప్పిన నాగార్జున.. అదే బొంగుని పదే పదే అన‌డం కొందిరికి షాకిచ్చింది. అయితే బిగ్ బాస్ హోస్ట్‌గా ఉన్న నాగ్ ప్ర‌తి వారం సరికొత్త డ్రెస్‌ల‌లో ద‌ర్శ‌న‌మిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఎల్లో క‌ల‌ర్ స్వెట‌ర్‌లో ట్రెండీగా ద‌ర్శ‌న‌మిచ్చి అద‌ర‌గొట్టాడు నాగార్జున . ఈ స్వెట‌ర్‌పై అమ‌ర్ దీప్ క‌న్ను కూడా ప‌డింది. తాను ఈ స్వెట‌ర్ కావాల‌ని అడ‌గ‌గా, దానికి అమ‌ర్‌ని కూర్చోమ‌ని అన్నాడు. అయితే ఇది చూడ‌టానికి సింపుల్‌గా క‌నిపిస్తోన్న ఈ స్వెట‌ర్ ధ‌ర వింటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోవ‌డం ఖాయం.ఈ స్వెట‌ర్ డియోర్ అనే ఇంట‌ర్‌నేష‌న‌ల్‌ బ్రాండ్‌కు చెందిన‌ది. ఈ స్వెట‌ర్ ధ‌ర ఇండియ‌న్ క‌రెన్సీలో రెండు ల‌క్ష‌ల ప‌ద‌కొండు వేల ఐదు వంద‌ల వ‌ర‌కు ఉంటుంది. వామ్మో అంత కాస్ట్ లీ స్వెట‌ర్ ధ‌రించావా అంటూ పొగ‌డ్తలు కురిపిస్తున్నారు, మ‌న్మ‌థుడా మ‌జాకానా అని కామెంట్ చేస్తున్నారు.

Bigg Boss 7 Telugu do you know the price of sweater of nagarjuna
Bigg Boss 7 Telugu

ఇక గత ఐదు సీజన్ల నుంచి తెలుగు బిగ్‌బాస్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి బిగ్‌బాస్‌ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నాని ఆ ప్లేస్ లోకి వచ్చారు. ఈ యంగ్ హీరోలిద్దరూ కేవలం ఒక్కో సీజన్‌కు మాత్రమే హోస్ట్‌గా చేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌కు హోస్ట్ గా వచ్చారు అక్కినేని నాగార్జున. కాని నాగార్జున మాత్రం అన్ని సీజ‌న్స్‌లో స‌రికొత్త‌గా క‌నిపిస్తూ అంద‌రిని అల‌రిస్తున్నారు. ఎన్టీఆర్, నాని ఎప్పుడు సూట్స్ లో క‌నిపించ‌గా నాగార్జున మాత్రం ట్రెండీ దుస్తుల‌లో క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now