Categories: వినోదం

Bigg Boss 5 : నువ్వేమ‌న్నా హీరోవా.. అంటూ సన్నీపై ఫైర్ అయిన సిరి..!

Bigg Boss 5 : గ‌త మూడు రోజులుగా హౌజ్‌మేట్స్ ను తమ తమ ఎమోష‌న‌ల్ వీడియోల‌తో ఎంట‌ర్‌టైన్ చేసిన బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌లో ప‌లు టాస్క్‌లు ఇచ్చాడు. అంత‌కు ముందు సిరి-ష‌ణ్ముఖ్ ఇద్ద‌రూ వేరే ప్ర‌పంచంలోకి వెళ్లి పోయారు. సిరి నాకు పడిపోయావ్‌ కదా అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని పులిహోర ముచ్చట్లు మాట్లాడాడు షణ్ను.

పాత టాస్కులను మరోసారి ప్రవేశపెట్టాడు బిగ్ బాస్. మొదటగా బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో మానస్‌, షణ్ముఖ్‌ పోటీపడగా మానస్‌ గెలిచాడు. అనంతరం ఇంటిసభ్యులందరూ 13 నిమిషాలు లెక్కించాలని మూడో టాస్క్‌ ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌ అంతా తీక్షణంగా క్షణాలను లెక్కిస్తున్న సమయంలో బిగ్‌బాస్‌ వారిని డిస్టర్బ్‌ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించాడు. ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ ఆరగించారు.

తర్వాత సిరి, షణ్ను ఒకరిగురించి మరొకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ స‌మ‌యంలో బిగ్‌బాస్‌ నాలుగో టాస్క్‌లో కొన్ని శబ్ధాలు ప్లే చేయగా అవేంటో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా గుర్తించి తప్పులో కాలేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్‌ గెలుపొందాడు.

ఐదో టాస్కులో తాళ్లను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. ఓడిపోయావ్‌ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు, కానీ ఆమెకు ఓడిపోయావన్న మాట అస్సలు నచ్చలేదు. తిందాం రమ్మని పిలిచినప్పటికీ రానంటూ మొండిగా ప్రవర్తించింది.

పక్కనోడు గెలిస్తే సహించలేనంటూ ఆవేశంతో ఊగిపోయింది. నాతో జోకులొద్దు అని సన్నీకి వార్నింగ్‌ ఇచ్చింది. సిరి అరవడంతో సహనం కోల్పోయిన సన్నీ ఆమెను ఇమిటేట్‌ చేయగా సిరి మరింత ఉడికెత్తిపోయింది. ప్రతిసారి వచ్చి ఇమిటేట్‌ చేయడమేంటని మండిపడింది. నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా ? తోపు అని ఫీలవుతున్నావా ? అంటూ ఏకిపారేసింది. మాటలు పడింది నేను, మళ్లీ పిజ్జా తిందువు రా అని పిలిస్తే ఎవడొస్తాడు అని చిర్రెత్తిపోయింది.

అటు సన్నీ.. మానస్‌తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఏ గొడవైనా కూడా నేనే వెళ్తాను, ఇంత ఓవరాక్టింగ్‌ బ్యాచ్‌ ఏంట్రా? వెళ్లేముందు నన్ను బ్యాడ్‌ చేస్తే వాళ్లకు ఏమొస్తదిరా ? నువ్వు పెద్ద హీరోవా ? అంటే నన్ను ఇష్టపడేవాళ్లకు, నా దునియాల నేను హీరోనే’ అని స్పష్టం చేశాడు సన్నీ.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM