Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్‌కి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ వారం హౌజ్‌మేట్స్ ఫుల్ చిల్ కానున్నారు. అయితే ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ముందుగా శ్రీరామ్ ఫినాలేకి చేరుకోగా, ఆ తర్వాత సన్నీ, సిరి, షణ్ముఖ్, మానస్ ఫినాలే చేరారు. ఎవరు ఈ సీజన్ విజేత అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ లెవరనేది మరింత ఆసక్తి క్రియేట్ చేస్తోంది. గత రెండు సీజన్స్ లోనూ మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఎవరు గెస్టులుగా రాబోతున్నారనే విషయం సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో పలు బిగ్‌స్టార్స్ పేర్లు వైరల్ అవుతుండటం విశేషం. డిసెంబర్ 19న జరుగనున్న గ్రాండ్ ఫినాలే లో `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్ సందడి చేయబోతుందని, గెస్ట్ లుగా సర్‌ప్రైజ్ చేయబోతున్నారనే వార్తలొచ్చాయి.
రామ్ చరణ్, అలియా భట్‌తోపాటు బాలీవుడ్ స్టార్స్ దిగబోతున్నారని టాక్. `83` సినిమా నుంచి రణ్‌వీర్ సింగ్, దీపికా గెస్ట్ లుగా రాబోతున్నారని అంటున్నారు. ఈ షోలో తమ సినిమాని ప్రమోట్ చేసుకోవాలని కూడా రణ్‌వీర్, దీపికా టీమ్ భావిస్తుందట. మరి ఇందులో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది.
కాగా.. సీజన్ 5లో కొట్లాటలు, టాస్క్ లలో ఫైటింగ్‌లతో ఆద్యంతం షోని రక్తికట్టించిన సందర్బాలు చాలానే ఉన్నాయి. రేటింగ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో మాత్రం ఈ ఐదో సీజన్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…