Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్‌గా 100 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 5న 19మంది సభ్యులతో మొదలైన ఈ షో మరో వారం రోజులలో ముగియనుంది. ఈ షో ఇప్పటి వరకు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించింది. ఇక చివరి వారం రోజులు కూడా ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు.
మానస్ – సన్నీ కప్పు గురించి కబుర్లాడారు. సన్నీ మాట్లాడుతూ.. ‘టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా టైటిల్ గెలవాలి, మా అమ్మకు కప్ ఇస్తరా బయ్.. ఇది ఫిక్స్.. ఏదైనా కానీ.. బరాబర్ కప్పు ఇస్తా..’ అంటూ తన విజయంపై ధీమా వ్యక్తం చేశాడు. మానస్.. టెన్షన్ పడకురా.. అంటూ ధైర్యం చెప్పాడు. షణ్ముఖ్.. సిరి, శ్రీరామ్‌లతో జెస్సీ గాడు పెద్ద రాడ్ దింపాడు.. అని చెప్పుకొచ్చాడు. అనంతరం బిగ్‌బాస్ ఫైనలిస్టుల జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించడానికి రెడీ అయ్యాడు.
మొదటగా ఫస్ట్ ఫైనలిస్టు శ్రీరామ్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. అతడు గార్డెన్ ఏరియాలోకి వచ్చి ఇప్పటివరకు జరిగిన టాస్కుల తాలూకు వస్తువులు చూసి ముచ్చటపడిపోయాడు. మీ పాటే కాకుండా మాట, ఆటతో లక్షల మందిని పలకరించారు. ఆటలో మీరు చూపించిన పోరాట పటిమ, స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు ప్రపంచానికి కొత్త శ్రీరామ్‌ను పరిచయం చేశాయి. మీరు వన్ మ్యాన్ ఆర్మీలా లక్ష్యం వైపు ముందుకెళ్లారు.. అంటూ జర్నీ వీడియోను ప్లే చేశారు.
ఇది చూసి శ్రీరామ్ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఈ రోజును మర్చిపోలేను. నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను, బిగ్‌బాస్ నా ఎమోషన్స్‌ను బయటపెట్టగలిగింది.. ఈ జర్నీ నాకు వెరీవెరీ స్పెషల్ అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. నీ మనసుకు బాగా దగ్గరైన ఒక ఫొటోను తీసుకెళ్లమని బిగ్‌బాస్ అవకాశమివ్వగా శ్రీరామ్ తన చెల్లితో ఉన్న ఫొటోను తీసుకున్నాడు.
తర్వాత మానస్ గార్డెన్ ఏరియాలోకి వచ్చాడు. అమ్మ ముద్దుల కొడుకుగా ఇంట్లో అడుగుపెట్టారు. ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి ఇప్పటివరకు మీ ఓర్పు, అందరినీ అర్థం చేసుకునే తత్వం ఈ ఇంట్లో మీకు ప్రత్యేక స్థానాన్ని తీసుకువచ్చాయి. స్నేహం కోసం ఆఖరివరకు నిలబడ్డ తీరు ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. మనసు నొప్పించకుండా విషయం అర్థమయ్యేలా సున్నితంగా చెప్పడం, అవసరమైతే గొంతెత్తి నిలదీయడం.. మీకే చెల్లింది.. అని జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్. తర్వాత ఒక ఫొటోగ్రాప్ తీసుకెళ్లమంటే బిగ్‌బాస్‌ను అభ్యర్థించి రెండు ఫొటోలు పట్టుకెళ్లాడు. అమ్మతో దిగిన ఫొటోతో పాటు తన ఫ్రెండ్ సన్నీతో ఉన్న ఫొటోను జాగ్రత్తగా కాపాడుకుంటానన్నాడు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…