Samantha Pushpa Song : గ్లామర్ బ్యూటీ సమంత ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాలలో హీరోయిన్‌గా చేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ కోసం స్పెషల్ సాంగ్‌లో చేసింది. డిసెంబర్ 10న విడుదలైన.. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
ఈ పాటలో సమంత కుర్రకారు మతులు పోగొడుతోంది. మరోవైపు చంద్రబోస్ సాహిత్యం, ఇంద్రావతి చౌహాన్ గాత్రం పాటకి మాంచి ఊపు తెచ్చాయి. అయితే ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో ఆ పాటపై అదే రేంజ్‌లో రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల ఈ సాంగ్ తమిళ స్టార్ హీరో సూర్య-తమన్నా జంటగా నటించిన వీడొక్కడే మూవీ లోని ‘హానీ.. హానీ..’ పాటకు కాపీ అంటూ ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఈ సాంగ్ మరో వివాదంలో ఇరుక్కుంది.
సమంత చేసిన ఐటమ్ సాంగ్ లోని లిరిక్స్ పురుష సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని.. వెంటనే ఆ పాటను తీసేయాలి.. అంటూ డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ సంస్థ. పురుషులను కించపరుస్తూ.. లిరిక్స్ రాయడం ఏంటని… వెంటనే దీనిపై క్షమాపణలు చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ తీసిన చిత్ర బృందంపై.. అలాగే ఈ సాంగ్ లో నటించినందుకు సమంతపై.. కేసు నమోదు చేసినట్లు.. సమాచారం అందుతోంది. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…