Allu Arjun : టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించగా, దీనికి వేలాది మంది తరలి వచ్చారు.
బన్నీ ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయడం పోలీసులకి, నిర్వాహకులకి తలకు మించిన భారంగా మారింది. ఈ ఈవెంట్‌లో తొక్కిసలాట జరగడంతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య అల్లు అర్జున్ తన అభిమానులతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో ఫ్యాన్స్‌తో ఫోటో సెషన్ నిర్వహించారు. అయితే అభిమానులు భారీగా పోటెత్తడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. పలువురు అభిమానులు గాయపడ్డారు.
దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌లో పలువురు అభిమానులకు గాయాలయ్యాయని తెలిసింది. నా వ్యక్తిగత టీమ్ దానిపై మానిటరింగ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రతి విషయం నాకు చేరవేస్తున్నారు. వారిని బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాదని నా వైపునుంచి హామీ ఇస్తున్నా. మీ ప్రేమ, అభిమానాలు నాకు పెద్ద అసెట్. వారి ప్రేమని ఎప్పుడూ లైట్ తీసుకోను` అని తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…