Bhagavanth Kesari OTT Release Date : బాలయ్య భగవంత్ కేసరి సినిమా ఓటీటీ వివరాలు ఇవే.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కాబోతోందంటే..?

November 10, 2023 6:00 PM

Bhagavanth Kesari OTT Release Date : నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి సినిమా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా, థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయింది. థియేటర్లలో మిస్ అయినా ప్రేక్షకులు ఇప్పుడు ఓటిటిలో ఎంజాయ్ చేయొచ్చు. ఈ నెలలోనే, బాలయ్య నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన స్ట్రీమింగ్ వివరాలని చూద్దాం. నవంబర్ 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో భగవంత్ కేసరి స్ట్రీమింగ్ అవబోతోంది.

అంతకు ముందు నవంబర్ 25 తేదీ అనే వాదన కూడా వినపడింది. క్లారిటీ అయితే రావాల్సి వుంది. దసరాకి కానుకగా, అక్టోబర్ 19న బాలయ్య భగవంత్ కేసరి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా, 99 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. రెండవ వారంలో 26 కోట్ల మేర వసూలు చేసింది. మొత్తంగా 125 కోట్ల మేర గ్రాస్, 69 కోట్ల మేర షేర్ వసూలు చేసింది.

Bhagavanth Kesari OTT Release Date
Bhagavanth Kesari OTT Release Date

భగవంత్ కేసరి సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. బాలయ్య తొలిసారి జతకట్టి బ్లాక్ బస్టర్ కొట్టేశారు అనిల్. ఆడపిల్లల్ని ప్రోత్సహించాలనే మెసేజ్ ఇస్తూ మంచి కమర్షియల్ సినిమాని తెరమీదకి తీసుకువచ్చారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ని, ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం చేశారు. కాజల్, శ్రీలీల కూడా, వారి పాత్రకి తగ్గట్టుగా నటించారు.

నవంబర్ 23 నుండి అమెజాన్లో అందుబాటులో ఉంటుంది అన్నారు. నవంబర్ 23 లేదా నవంబర్ 25 న ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తుంది. ఎంజాయ్ చేసేయొచ్చు.  వరుస హిట్ల తో బాలయ్య దూసుకు వెళ్ళిపోతున్నాడు. భగవంత్ కేసరి కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమా ని మీరు థియేటర్ లలో చూడడం మిస్ అయితే, ఓటీటీ లో మిస్ అవ్వకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now