Bhagavanth Kesari OTT : ఓటీటీలో ర‌చ్చ చేయనున్న భ‌గవంత్ కేస‌రి.. ఎందులో, ఎప్పటి నుండి అంటే..!

November 24, 2023 11:22 AM

Bhagavanth Kesari OTT : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం స‌క్సెస్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక‌వైపు బుల్లితెర‌పై మ‌రోవైపు వెండితెర‌పై సంద‌డి చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ సినిమా చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా భారీగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ చిత్రం థియేటర్లలో దాదాపు ఐదు వారాల పాటు సందడి చేసింది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోవడంతో పాటు లాభాలను కూడా సొంతం చేసుకుంది. తద్వారా బాలయ్యకు విజయాల హ్యాట్రిక్‌ను ఈ చిత్రం అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు వచ్చేశాయి.

ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను మంచి ధరకు దక్కించుకోగా, ఈ చిత్రాన్ని థియేటర్లలోకి వచ్చిన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని సమాచారం. గురువారం (నవంబర్ 23) అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది.ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ ఏడాది మొదట్లో వీర సింహా రెడ్డి తర్వాత మరోసారి రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన రెండో బాలయ్య బాబు సినిమాగా నిలిచింది.

Bhagavanth Kesari OTT know the platform and streaming details
Bhagavanth Kesari OTT

.. బాలయ్య కెరీర్‌లోనే విభిన్నమైన కథాంశంతో రూపొందిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా.. శ్రీలీల కీలక పాత్రను చేసింది. అర్జున్ రాంపాల్ విలన్‌ రోల్‌ను పోషించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్‌ను సాధించి కేక పెట్టించింది. ఇది కూడా బాలయ్య కెరీర్’లో అరుదైన రికార్డ్.. గా చెప్పోచ్చు. ఏజ్‌కు తగ్గ పాత్రలో నటిస్తూ.. మంచి కమర్షియల్ హిట్‌ను అందుకోవడం అదుర్స్ అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అంతేకాదు వరుసగా మూడు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని హాట్రిక్ 50 కోట్ల షేర్ ని సొంతం చేసుకున్న హీరోగా సంచలనం సృష్టించాడు బాలయ్య.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now