Balakrishna : వ‌రుస స‌క్సెస్‌లు.. త‌న రెమ్యున‌రేష‌న్‌ను పెంచేసిన బాల‌య్య‌.. ఎంతంటే..?

November 15, 2023 1:31 PM

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ ఇటీవ‌ల వ‌రుస విజయాల‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు.బాలయ్య అఖండ సినిమాతో మళ్లీ.. కంబ్యాక్ ఇవ్వ‌గా, ఇందులో కొత్త అవతార్ లో దర్శనం ఇచ్చి… ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు కలెక్ట్ చేసి ప్రభాంజనం సృష్టించింది. అఖండ సినిమా తర్వాత బాలయ్య అన్ స్టాపబుల్ షో చేయ‌గా, మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. రెండో సీజన్ కూడా చేశాడు. అది కూడా ఓటీటీలో దుమ్ము లేపింది. ఇక ఈ అన్ స్టాపబుల్ షోస్ తర్వాత బాలయ్య ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దిమ్మతిరిగే వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్యకు మరింత ఊపు వచ్చిందనే చెప్పాలి. వీరసింహారెడ్డి సినిమా తర్వాత బాలయ్య… అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాలో బాల‌య్య స‌రికొత్త‌గా క‌నిపించి అల‌రించాడు. బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే.. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్, బీజీఎం… వేరే లెవెల్ అని చెప్పవచ్చు. బాలయ్య సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మొదటి సారిగా నటించింది. యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. బాలయ్య కూతురిగా న‌టించింది. భారీ బ‌డ్జెట్‌తో చిత్రం రూపొందింది.

Balakrishna increased his remuneration
Balakrishna

ప్ర‌స్తుతం బాల‌య్య బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశాడు. బాలయ్య 109వ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా, ఈ సినిమా కోసం బాల‌య్య భారీగా రెమ్యునరేష‌న్ పెంచాడ‌ట‌. భగవంత్ కేసరి చిత్రానికి గానూ బాలయ్యకు 18 కోట్లు తీసుకున్న బాల‌య్య ఇప్పుడు బాబీ సినిమా కోసం 25 కోట్ల కు పెంచినట్లు తెలుస్తోంది. వరసపెట్టి బాలయ్య హిట్స్ ఇస్తూండటంతో నిర్మాత‌లు కూడా బాల‌య్య ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తుంది. ఇక చిత్రంలో బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ చిత్రం ఒక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ డ్రామాని ఇప్పటికే తెలుస్తోంది. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండ‌గా, వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now