వాణీ జ‌య‌రాం గురించి ఆ విష‌యాలు ముందుగానే చెప్పిన జ్యోతిష్యుడు

February 7, 2023 9:19 PM

వాణీ జ‌య‌రాం.. తెలుగు, త‌మిళ‌తంతో పాటు ప‌లు భాష‌ల‌లో త‌న గానామృతంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని గెలుచుకున్న గొప్ప సింగ‌ర్. ఓ నదిలా ఆమె పాటల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అయితే ఆమె గాయని అవుతుందని చిన్నప్పుడే జ్యోతిష్యుడు చెప్పాడట. కేవలం పది రోజుల చిన్నారిని చూసి ఆయన ప్రెడిక్ట్ చేయగా, అదే నిజమవ్వడం విశేషం. తన తల్లిదండ్రులకు వాణి జయరాం ఐదవ సంతానం కాగా, తాను పుట్టి పది రోజులే అవుతుందట. ఆ సమయంలో తన తల్లికి జ్వరం వచ్చిందట. ఇంకా తనకు నామకరణం చేయలేదు.

అయితే అప్పుడు ఏం పేరుపెట్టాలనేదానిపై తండ్రి తన పుట్టిన డేట్‌, టైమ్‌ తీసుకుని వెల్లూరులోని ఓ ఆస్ట్రోలజర్‌కి వద్దకి వెళ్లాడట. తన ఫాదర్‌ చెప్పిన డిటెయిల్స్ ని బట్టి ఆయన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడని వాణీ జ‌య‌రాం ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. తన జాతకం చూసి, ఈ బేబీ పెద్దయ్యాక పెద్ద సింగర్‌ అవుతుందని, అయితే అది విని తన ఫాదర్‌ నవ్వుకున్నాడని వాణీ అన్నారు.. అంతేకాదు తనకు `కలైవాణి` అనే పేరు కూడా పెట్టమన్నాడట. ఈ విషయం విని తన అమ్మకూడా నవ్వుకుందని, కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు తనకు కలైవాణి అనే పేరు నామకరణం చేశారట.

astrologer told about vani jayaram before

అప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటే నిజమవ్వడం ఆశ్చర్యంగా ఉంది. అంతా ఆ దేవుడి దయ వల్లే జరిగిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది వాణి జయరాం. దాదాపు ఐదు దశాబ్దాలుగా గాయనీగా రాణిస్తున్న వాణి జయరాం అద్భుతమైన గాత్రానికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చిచేరాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం `పద్మ భూషణ్‌` పురస్కారాన్ని ప్రకటించగా, ప్లే బ్యాక్‌ సింగర్‌గా మూడు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. అందులో `శంకరాభరణం`, `స్వాతికిరణం`, తమిళంలో `అపూర్వ రాగంగల్` చిత్రాల్లోని పాటలకు ఉత్తమ గాయనీగా మూడు నేషనల్‌ అవార్డులు వరించాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment