Anushka Shetty : అన్ని సార్లు ఆ మెగా హీరో మూవీని అనుష్క ఎందుకు రిజెక్ట్ చేసింది..?

November 10, 2023 7:56 PM

Anushka Shetty : అనుష్క గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అనుష్క శెట్టి మనందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అనుష్క శెట్టి పేరు తెచ్చుకుంది అనుష్క. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ ని రిజెక్ట్ చేసిందంట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. అనుష్క శెట్టి ఈమధ్య సినిమాలకి బాగా దూరంగా ఉంటోంది. ఎప్పుడో ఒకసారి కనపడి మళ్ళీ మాయమై పోతోంది. మొదట్లో ఈమె చాలా కూల్ గా, సంతోషంగా కెరీయర్ ని స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోల పక్కన నటించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే, కొంతకాలం నుండి కూడా ఈమె సినిమాలకి బాగా దూరంగా ఉంటోంది. రామ్ చరణ్ తో అవకాశం వచ్చినా, స్వీటీ రిజెక్ట్ చేసిందట. స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ ని అందుకుంది అనుష్క శెట్టి. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆమె కోసం డైరెక్టర్లు, హీరోలు క్యూ కట్టేవారు వరుసగా తెలుగు, తమిళ భాష సినిమాలో నటిస్తూ కెరియర్ పరంగా మంచి సక్సెస్ ని అందుకుంది అనుష్క. ప్రస్తుతం అయితే సినిమాలకి దూరంగా ఉంటోంది. తాజాగా అనుష్కకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Anushka Shetty why she rejected that mega hero movie 3 times
Anushka Shetty

యంగ్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలతో కూడా నటించింది అనుష్క. కానీ రామ్ చరణ్ తో మాత్రం ఆమె నటించలేదు. అందుకు కారణం ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ తో మూడుసార్లు నటించే ఛాన్స్ అనుష్కకి వచ్చిందట. కానీ, మూడుసార్లు కూడా ఆమె రిజెక్ట్ చేసిందట.

ముందుగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో మగధీర సినిమా రావాల్సి ఉండేది కానీ అది మిస్ అయింది. ఆ తర్వాత గోవిందుడు అందరివాడే సినిమాలో కూడా ఆమెకి అవకాశం వచ్చింది. కానీ, అప్పుడు ఆమె బిజీగా ఉండడంతో ఆ సినిమాని ఒప్పుకోలేదు. రచ్చ సినిమాలో కూడా అనుష్కకి రామ్ చరణ్ తో నటించే అవకాశం వచ్చింది. కానీ దానిని కూడా అనుష్క ఒప్పుకోలేదు. ఇలా మూడుసార్లు ఆమె చరణ్ మూవీ ని రిజెక్ట్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now