Anushka Shetty : విచిత్ర‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న అనుష్క శెట్టి.. ఈమెకు న‌వ్వే జ‌బ్బు ఉంద‌ట‌..!

June 23, 2024 2:47 PM

Anushka Shetty : న‌వ్వు వ‌ల్ల ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌న‌కు వైద్యులు చెబుతుంటారు. అందుక‌నే రోజూ కాసేపు హాయిగా న‌వ్వాల‌ని కూడా సూచిస్తుంటారు. అయితే మీకు తెలుసా.. కొంద‌రు త‌మ‌కు న‌వ్వు వ‌స్తే ఆప‌కుండా అదే ప‌నిగా న‌వ్వుతుంటారు. ఇదే క్ర‌మంలో వారు కింద‌ప‌డి దొర్లుతూ క‌డుపుబ్బా న‌వ్వుతుంటారు. ఇలా కొంద‌రికి న‌వ్వు కానీ, ఏడుపు కానీ వ‌స్తే ఒక ప‌ట్టాన ఆగ‌వు. కానీ కాసేప‌టికి అవే ఆగిపోతాయి. అయితే ఇంకా కొంద‌రికి మాత్రం న‌వ్వు లేదా ఏడుపు ఏది వ‌చ్చినా స‌రే ఒక ప‌ట్టాన ఆగ‌ద‌ట‌. నిరంత‌రాయంగా 15 నుంచి 20 నిమిషాల పాటు న‌వ్వుతూనే ఉంటార‌ట‌. అవును కొంద‌రు ఇలాగే చేస్తారు.

అయితే ఇలా నిరంత‌రాయంగా ఆప‌కుండా ఏడ్చిన‌, న‌వ్వినా దాన్ని జ‌బ్బే అని అంటున్నారు వైద్యులు. నిజంగా ఈ జ‌బ్బుతోనే న‌టి అనుష్క శెట్టి కూడా బాధ‌ప‌డుతోంద‌ట‌. దీని వ‌ల్ల ఆమె సినిమా షూటింగ్‌ల‌లో చాలా సార్లు షూటింగ్‌ను కాసేపు ఆపేయాల్సి వ‌చ్చింద‌ట కూడా. కామెడీ సీన్లు చేస్తే బాగా న‌వ్వేద‌ట‌. ఎమోష‌నల్ సీన్లు చేస్తే బాగా ఏడ్చేద‌ట‌. అలా ఆప‌కుండా 15 నుంచి 20 నిమిషాలు చేసేద‌ట‌. దీంతో చాలా సేపు సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడేద‌ట‌. ఈవిష‌యాన్ని ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమే స్వ‌యంగా వెల్ల‌డించింది.

Anushka Shetty has suffering from laughing disease know the details
Anushka Shetty

అయితే దీన్ని వైద్య ప‌రిభాష‌లో pseudobulbar affect (PBA) అంటార‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ జ‌బ్బుతో అమెరికాలో సుమారుగా 20 నుంచి 70 ల‌క్ష‌ల మంది బాధ‌ప‌డుతున్నార‌ని క్లీవ్‌లాండ్ క్లినిక్ తెలియ‌జేసింది. అయితే ఈ జ‌బ్బు వ‌చ్చేందుకు ప్ర‌త్యేక కార‌ణాలు ఏమీ ఉండ‌వ‌ని, ప‌లు నాడీ సంబంధ స‌మ‌స్య‌లు లేదా త‌ల‌కు గాయం అవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ఇలా జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే మాన‌సిక వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో దీన్ని న‌యం చేసే చాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now