Annapoorani OTT Release Date : లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపురాణి (అన్నపూర్ణ): ది గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రం నయనతార కెరీర్‌లో 75వ చిత్రంగా రూపొందింది. ఈ చిత్రంలో జై సంపత్, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కేఎస్ రవికుమార్, రెడిన్ కింగ్స్‌లే తదితరులు నటించారు. ట్రైడెంట్ ఆర్ట్స్, నాడ్ స్టూడియోస్, జీ స్టూడియో నిర్మించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. జతిన్ సేథి, ఆర్ రవీంద్రన్ నిర్మాతలుగా వ్యవహరించిన అన్నపూర్ణి సినిమాకు తమన్ ఎస్ మ్యూజిక్ అందించారు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది.
డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పుడే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది.డిసెంబర్ 29న అన్నపూర్ణి మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్స్ లో పెద్దగా అలరించని ఈ మూవీ ఓటీటీలో మాత్రం అలరిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా కథలోకి వెళితే.. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్రమంలో తనకు ఎదురైనా సవాళ్లు ఎంటి.. కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది చిత్ర కథ.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఈ ఏడాది నయన్ పెద్ద విజయాన్ని అందుకుంది. షారుక్‌తో నయనతార నటించిన ‘జవాన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయలను వసూలు చేయగా, ఇందులో నయనతార యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టింది. ప్రస్తుతం నయనతారకి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. తెలుగు, తమిళంలో అనేక పాత్రలలో అలరించిన లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు బాలీవుడ్‌లోను సరికొత్త పాత్రలలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…