Animal Movie 1st Week Collections : వైల్డ్ యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందిన చిత్రం యానిమల్. ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. దీంతో దీనికి వసూళ్లు అదిరిపోయేలా వస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రమే ‘యానిమల్’. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు.
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేసుకున్నారు. దీంతో మొదటి రోజు రూ. 63.80 కోట్లు, రెండో రోజు రూ. 66.27, మూడో రోజు రూ. 71.46 కోట్లు, నాలుగో రోజు రూ. 43.96 కోట్లు, ఐదో రోజు రూ. 37.47 కోట్లు, ఆరో రోజు రూ. 30.39 కోట్లు వచ్చాయి. ఇక, ఏడో రోజు ఈ చిత్రం రూ. 25.50 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.
యానిమల్ సినిమాకు ఇండియాలోనే రూ.337.58కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఇండియాలో రూ.400కోట్ల మార్కును యానిమల్ దాటేసింది. మరోవైపు, తెలుగులోనూ యానిమల్ జోరు చూపిస్తోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తయి.. బయ్యర్లు లాభాల్లోకి కూడా వచ్చేశారు.అమెరికా, కెనడాల్లో యానిమల్ సినిమా కలెక్షన్లు 9 మిలియన్ డాలర్లను దాటింది. 10 మిలియన్ డాలర్ల వైపుగా వెళుతోంది. ఓవర్సీస్‍లోనూ చాలా చోట్ల యానిమల్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర యునిట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
యానిమల్ సినిమా జస్ట్ మైండ్ బ్లోయింగ్ అని.. ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ పిచ్చెక్కించిందని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్స్ పీరియన్స్‌ను వేరే లెవల్ కు తీసుకువెళ్లావు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీ మ్యాజిక్‌తో నా నోట మాటలు రావడం లేదు. రష్మిక, బ్రిలియంట్ గా నటించావ్ ఇప్పటి దాకా నీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇది, ఇంకా ఇలాంటివి మరెన్నో చేయబోతున్నావని అర్ధం అవుతోంది. బాబీ డియోల్ మీ నటన మమ్మల్ని సైలెంట్ చేసింది, మీ టెరిఫిక్ నటనకు నా రెస్పెక్ట్. యంగ్ హీరోయిన్ తృప్తి గుండెలను బ్రేక్ చేస్తోంది, ఇంకా చేస్తుందని భావిస్తున్నాను. మిగతా అందరు నటీనటులు, టెక్నీషియన్లు కూడా సినిమాను మరో లెవల్‌కి తీసుకు వెళ్లారు అని అన్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…